టీఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ఏకైక కుమారుడు హర్ష రెడ్డి రిసెప్షన్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. 12 ఎకరాల స్థలంలో రిసెప్షన్ కొరకు ఏర్పాట్లు చేశారు. వీఐపీల భోజనాల కోసం మూడు ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. దాదాపు 2 లక్షల మంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కు ఆహ్వానం అందింది. 
 
ఈ వేడుకకు మంత్రి హాజరు కాగా అక్కడ పువ్వాడకు చేదు అనుభవం ఎదురైంది. ఈ వేడుకకు తెలంగాణ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్, పువ్వాడ అజయ్, మంత్రులు, కొందరు నేతలు హాజరయ్యారు. కొందరు ప్రైవేట్ సెక్యూరిటీ పువ్వాడ వెళుతున్న సమయంలో ఆయనను అడ్డుకున్నారు. ఈ ఘటనతో షాక్ అయిన పువ్వాడ సెక్యూరిటీ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. 
 
మంత్రి అక్కడే ఉన్నా పోలీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల దుబాయ్ లో హర్ష రెడ్డి వివాహ వేడుక ఘనంగా జరిగింది. వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వేడుకల్లో పొంగులేటి కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్సులు చేశారు. పెళ్లికి హాజరు కాని వారి కోసం బాహుబలి తరహా సెట్లతో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. 
 
100 ఎకరాల స్థలంలో షామియానాలు వేసి న భూతో న భవిష్యత్ అనేలా రిసెప్షన్ వేడుకలను చేశారు. ఏపీ నుండి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారని సమాచారం. భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో పోలీసులు అధిక సంఖ్యలో హాజరై బందోబస్త్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఇక్బాల్ స్వయంగా భద్రతా ఏర్పాట్లు చేశారు.                     

మరింత సమాచారం తెలుసుకోండి: