జనసేన పార్టీ రాజకీయ సిద్ధాంతం ఏంటో ? ఆ పార్టీ వేస్తున్న అడుగులు ఎటు వైపో తెలియక ఇప్పుడు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనలు కనిపిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలకు దూరంగా ఉంటాను అంటూ ప్రకటించిన పవన్ ఇప్పుడు మళ్లీ సినిమాల వైపు వెళ్లడంతో, అసలు మళ్లీ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో పవన్ యక్టివ్ అవుతారా అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా పవన్ పూర్తి స్థాయిలో సినిమాల్లో నటిస్తూ జనసేన పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మొత్తం జనసేన వ్యవహారాలన్నీ నాదెండ్ల మనోహర్ ఒక్కరే చూస్తున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు మరింతగా అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీని పూర్తిగా నాదెండ్ల మనోహర్ చేతుల్లో పెట్టేసి, పవన్ మళ్ళీ పూర్తిస్థాయి నటుడిగా మారిపోతారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.


 సినిమాల తరువాత పవన్ రాజకీయాల్లోకి కొంతకాలం యాక్టివ్ అవ్వడం, మళ్లీ సినిమాల్లోకి వెళ్లడం ఇదే తంతు జరుగుతూ వస్తుందనే  అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఇప్పటికి బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. ఆ పార్టీ నియమాల ప్రకారం, వారు సూచించిన విధంగానే నడుచుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఎక్కువగా ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ, నువ్వానేనా అన్నట్టుగ స్థానిక సంస్థల ఎన్నికల పోరులో విజేత గా నిలిచే ఎందుకు పోటీ పడుతున్నాయి. కానీ జనసేన హడావుడి పెద్దగా కనిపించడం లేదు. అసలు స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ దృష్టి పెడుతున్నట్టు కనిపించడం లేదు.


 దీంతో పవన్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి రావడం అనుమానంగానే ఉంది. ప్రస్తుతం షూటింగ్ లలో బిజీగా పవన్ ఉంటున్నారు. ఇంత కీలకమైన సమయంలో పవన్ పార్టీ గురించి పట్టించుకోకుండా, మొత్తం వ్యవహారాన్ని నాదెండ్ల మనోహర్ చేతుల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. పవన్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో వ్యవహరిస్తున్న తీరుపైనా కొంతమంది గుర్రుగా ఉన్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: