ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలందరికీ ప్రాణభయంతో వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది ఈ ప్రాంతమైన మహామ్మరి . ఇక చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ ప్రాణాంతకమైన వైరస్ ఇప్పుడిప్పుడే చైనా దేశంలో తగ్గుముఖం పడుతుంది. ఇతర దేశాలలో మాత్రం విజృంభిస్తుంది ఈ మహమ్మారి వైరస్. దీంతో ప్రపంచ దేశాలన్ని ప్రాణ భయంతో వణికి పోతున్నాయి. ఇక ఇప్పటికే భారత్ ను  కూడా ఈ ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ కరోనా వైరస్ మాత్రం రోజురోజుకు వేగంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. 

 

 అయితే కరోనా  వైరస్ సోకి  ప్రాణాలు పోవడం ఏమోగానీ... సోషల్ మీడియాలో కరోనా  వైరస్ పై  జరుగుతున్న ప్రచారం మాత్రం అందరినీ అయోమయంలో పడేస్తుంది. చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇంకా ఎంతో మందిని ప్రాణభయంతో వణికిస్తోంది. సోషల్ సోషల్ మీడియాలో ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా చికెన్ తింటే కరోనా  వైరస్ సోకుతుంది అంటూ ఓ ప్రచారం ఊపందుకోవడంతో ప్రజలు ఎంత చికెన్ తినాలని ఉన్నా కనీసం చికెన్ షాప్ వైపు చూడడానికి భయపడిపోతున్నారు . దీంతో పౌల్ట్రీ పరిశ్రమ మొత్తం తీవ్రస్థాయిలో నష్టాలను చవిచూస్తున్నాయి. చికెన్ ధరలతో పాటు కోడిగుడ్డు ధర భారీగా పడిపోపోయింది. 


 కేవలం చికెన్ కి మాత్రమే కాదు ఎగ్స్ కి  కూడా దూరంగానే ఉంటున్నారు. దీంతో చికెన్ తో  పాటు ఎగ్స్  ధరలు కూడా తగ్గిపోతుంది. ఇక కరోనా  వైరస్ పై వచ్చిన వదంతుల  కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ ఒక్కసారిగా కుదేలైంది అని చెప్పవచ్చు. అయితే కరోనా  ఎఫెక్ట్ కారణంగా పౌల్ట్రీ పరిశ్రమకు ఏకంగా 1,100 కోట్ల నష్టాలు వచ్చాయి. ప్రతిరోజూ 160 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. కోడి గుడ్డు ధర 20 రోజుల వ్యవధిలో 4.50 రూ..  నుంచి 2.50 రూ.. పడిపోయింది.   సగటున రోజుకి నాలుగు కోట్ల గుడ్ల  వరకు పెడుతున్నాయి కోళ్లు . కానీ గుడ్డును మాత్రం 35 శాతం మేర వినియోగిస్తున్నారు. మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాల్సి వస్తుంది. అయితే ఓ వైపు కోళ్ల ధరలు గుడ్ల ధరలు  తగ్గడం జరిగింది కానీ కోళ్లకు వేసే మేత  తగ్గకపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహణపై అత్యధికంగా వేయబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: