కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చినప్పటి నుంచి ఎన్నో వ్యతిరేక స్వరాలు వినిపించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఎన్నో హింసాత్మక నిరసనలు కూడా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగాయి. ఇక పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎంతోమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు కూడా. ఇక దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఇక మొన్నటి వరకు దేశ రాజధాని ఢిల్లీలో కూడా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు జరిగాయి. ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తీసుకు వచ్చి ఎన్ని రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ దీనిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 

 


 అయితే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై నేడు విచారణ జరిపినది  సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించింది. గతంలో రఫెల్  ఇష్యూలో ఎంత బలంగా అయితే వాదన వినిపించిందో  ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కూడా అంతే బలంగా వాదనలు వినిపించింది సుప్రీంకోర్టు. పౌరసత్వ సవరణ చట్టం చట్టబద్ధమైనదేనని కోర్టులో ఈ చట్టానికి ఎవరూ సవాలు చేయడానికి వీలు లేదు అంటూ తెలిపింది. సవరించిన పౌరసత్వ చట్టం పూర్తిగా చట్టబద్ధం రాజ్యాంగబద్ధమైనది అంటూ  తెలిపింది. ఇది పార్లమెంటు సార్వభౌమాధికారానికి సంబంధించిందని కోర్టులో దీనిని ఎవరూ సవాలు చేయడానికి వీలు ఉండదు అంటూ కేంద్రం స్పష్టం చేసింది. 

 


 దీంట్లో సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రిలిమినరీ  అఫిడవిట్లో రాజ్యాంగంలోని 246 అధికరణం కింద 7వ షెడ్యూల్లో నే లిస్టులో ఏ అంశం పైన ఆయన చట్టాలు చేసే అధికారులు పార్లమెంట్ కు  ఉన్నాయంటూ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం భారతీయ పౌరుడు హక్కులను కాలరాయడం లేదు అంటూ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రజాస్వామ్య హక్కులకు కూడా పౌరసత్వ సవరణ చట్టం భంగం కలిగించదు అంటూ తెలిపింది. ఈ దేశంలో ఉన్న పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఇతర దేశాల నుంచి వస్తున్న పౌరులు ఎవరు దేశంలో ఉండాలి  ఎవరు ఉండకూడదా అనే దానిపై మాత్రమే పనిచేస్తుంది అని కేంద్ర ప్రభుత్వం వాదన వినిపించింది. మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: