ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంబిస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా 167 కేసులు భారతదేశవ్యాప్తంగా నమోదయ్యాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకున్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ కరోనా  వైరస్ విజృంభణ మాత్రం ఆగడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా  కేసులు ప్రజల్లో  మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో దేశ ప్రజలందరి చిగురుటాకులా వణికిపోతున్నారు. అయితే ఈ ప్రాణాంతకమైన వైరస్ కు  ఇప్పటివరకు ఏ విరుగుడు  అందుబాటులోకి రాకపోవడంతో ప్రస్తుతం ప్రజల్లో ప్రాణభయం మరింత ఎక్కువ అవుతుంది. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా దిగ్బంధంలో ఉన్నాయి కూడా. 

 


 అయితే ఈ కరోనా  వైరస్ కేరళ రాష్ట్రంలో కూడా వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరోనా  వైరస్ నియంత్రణకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య ప్రజలకు ఎలాంటి పనులు చేసుకోకుండా ఇంట్లోనే ఉండాలి అని చెబితే జీవించడం కాస్త కష్టతరం అవుతుంది కాబట్టి... వాళ్లు వాళ్ల ఉద్యోగాలకు వెళ్లినప్పటికీ కరోనా  వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ లోని అన్ని బస్ స్టాప్ లో హ్యాండ్ వాషింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసింది కేరల  ప్రభుత్వం. సామాన్య ప్రజలు బస్సు దిగగానే అక్కడ శానిటైజర్స్  ద్వారా చేతులను శుభ్రంగా చేసుకుంటారు. అయితే దీనిపై  విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

 


 అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఆలోచన చేస్తే ఎంతో బాగుంటుంది అంటున్నారు. కరోనా  వైరస్ ను నియంత్రించడానికి ఇది మంచి మార్గం అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది అన్ని చోట్ల సాధ్యమా అనే అనుమానం వచ్చినప్పటికీ ప్రయత్నించాలి అంటున్నారు విశ్లేషకులు. కరోనా  వైరస్ నియంత్రణలో భాగంగా ఇలాంటి చర్యలు తీసుకుంటే కరోనా  వైరస్  తీవ్రత గురించి ప్రజలకు కూడా అర్థం అవుతుంది అని అంటున్నారు విశ్లేషకులు. డబ్బులు ఖర్చయినా పర్వాలేదు కానీ రాష్ట్ర ప్రజల ప్రాణాల కోసం ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇలాంటివి ఏర్పాటు చేస్తే మంచిది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: