కరోనా మహమ్మారి ప్రజలకు కంటి మీద నిద్ర కూడా లేకుండా చేస్తుంది అన్న సంగతి తెలిసిందే..చైనా నుంచి వచ్చిన కరోనా మహమ్మారి ఇక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ వస్తుంది..అందుకే ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని ఉద్దేశ్యంతో  కేంద్ర ప్రభుత్వం మోదీ తీసుకొచ్చిన జనతా కర్ఫ్యూ సడలింపు ను తీసుకొచ్చారు.. ఈ మేరకు ఈ కర్ఫ్యూ కు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.. 

 

 

విషయానికొస్తే...కరోనా మహ్మమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు విశేష స్పందన కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ బోసిపోయాయి. ఒక్క అత్యవసర సేవలు తప్ప మిగతా అన్నీ మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి...ఎక్కడ జన సంచారం లేదన్న విషయం తెలిసిందే.. రవాణా వ్యవస్థ కూడా ఈ మేరకు పూర్తిగా స్తంభించి పోయింది..

 

 

 

కరోనా భయం జైల్లో ఖైదీలకు కూడా పట్టుకుంది .. కోల్ కతాలోని డమ్ డమ్ సెంట్రల్ జైలు ఖైదీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమను బయటికి పంపించాలని, లేకపోతే కరోనాకు బలయ్యే ప్రమాదం ఉందని వారు అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఖైదీలు ఆవేశానికి లోనవడంతో జైల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఖైదీలు జైలుకు నిప్పంటించారు. పదేళ్లకు పైగా జైల్లో గడిపి సత్ప్రవర్తన చూపిన ఖైదీలకు కరోనా కారణంగా 15 రోజుల స్పెషల్ పెరోల్ ఇవ్వాలని జైలు అధికారులు నిర్ణయించడం కొందరు ఖైదీలకు రుచించలేదని, వారే జైలుకు నిప్పుపెట్టారని తెలుస్తోంది. 

 

 

 

భారీగా అగ్నికీలలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.ఈ ఘటనలో కొందరు ఖైదీలు కూడా దాడికి దిగారు.. అంతేకాకుండా జైల్ అధికారులపై గొడవలకు దిగారు.వారిని వెంటనే రిమాండ్ ద్వారా ఇంటికి పంపించాలని గగ్గోలు పెట్టారు.. అలాగే కరోనా భయం పూర్తిగా తగ్గేవరకు అందరికీ అనుమతి ఇవ్వాలని కోరారు.. గొడవలు తీవ్రంగా మారడంతో జైల్ అధికారులు భాస్ప వాయువును ప్రయోగించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: