ప్రంపచం మొత్తాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ గుర్తింపులో  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అతిపెద్ద ప్లాస్ పాయింట్ ఏమిటో తెలుసా ? గ్రామ వాలంటీర్ల వ్యవస్ధే. ఈ వ్యవస్ధలో పని చేస్తున్న 2.5 లక్షల మంది యువకులు అందిస్తున్న సేవల వల్లే రాష్ట్రం మొత్తం మీద కరోనా వైరస్ బాధితులను ప్రభుత్వం చాలా తొందరగా గుర్తించ గలుగుతోంది. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వారి వివరాలు, సమాచారం వెంటనే వాలంటీర్లకు అందుతుండటంతో  వైద్య సిబ్బంది కూడా అప్రమత్తమవుతున్నారు. వెంటనే వారి ఇళ్ళకు వెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించేస్తున్నారు.

 

ఫిబ్రవరి 10-మార్చి 21 మధ్య విదేశాల నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 10 వేల మంది వచ్చారు. వెంటనే వీళ్ళందరికీ స్క్రీనింగ్ పరీక్షలు చేసింది ప్రభుత్వం. వేలమందికి జరిపిన పరీక్షల్లో 122 మందికి కరోనా వైరస్ లక్షణాలున్నట్లు గుర్తించారు. అసలు ఇన్ని వేలమంది విదేశాల నుండి వచ్చినట్లు ప్రభుత్వానికి ఎలా తెలిసింది ? ఎలాగంటే గ్రామ వాలంటీర్ల వల్లే సమాచారం ఎప్పటికప్పుడు అందుతోంది. గ్రామాల్లోని ప్రతి 50 ఇళ్ళకు ప్రభుత్వం ఓ వాలంటీర్ ను నియమించింది.

 

తమకు కేటాయించిన ఇళ్ళకు రేషన్ సరుకులు అందేట్లు చూడటం, ఫించన్లు అందించటంతో పాటు వివిధ సంక్షే పథకాలు అందుతున్నది లేనిది చూసుకోవాల్సిన బాధ్యత వాలంటీర్లపైనే ఉంచింది ప్రభుత్వం. ఈ బాధ్యతలను వాలంటీర్లలు కూడా చాలా వరకూ నెరవేరుస్తున్నారు. దాంతో ప్రతిరోజు ఏదో ఓ సందర్భంలో ఇళ్ళకు రెగ్యులర్ గా వెళుతుండటంతో అందరితోను సన్నిహితం ఏర్పడింది. అందుకనే గ్రామాల్లో ఏమి జరిగినా వాలంటీర్లకు ఎవరో ఒకరి ద్వారా వెంటనే విషయం తెలిసిపోతోంది. విదేశాల నుండి వచ్చిన వారి సమాచారం కూడా వాలంటీర్లకు ఇలాగే తెలిసిపోతోంది.

 

అందుకనే వెంటనే విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించగలుగుతున్నారు. వైద్యాధికులతో పరీక్షలు చేయిస్తున్నారు. వాలంటీర్లు సమర్ధవంతంగా పనిచేయకపోతే 1.43 కోట్ల ఇళ్ళను సర్వే చేయటం ప్రభుత్వానికి మామూలుగా అయ్యే పనికాదు. మొత్తం మీద జగన్ నియమించిన వాలంటీర్ల వ్యవస్ధ పనితీరు మాత్రం బ్రహ్మాండమని నిరూపితమైంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: