ప్రపంచం మొత్తం కనిపించని శత్రువుతో పోరాటం చేస్తోంది. ఆ శత్రువు ఎటు  నుంచి దాడి చేస్తుందో తెలియదు... దాడి చేసింది అంటే దాదాపుగా ప్రాణాలను  హరించుకుపోతుంది. దీంతో ప్రపంచ దేశాల ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ  ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. రోజురోజుకు ఈ వైరస్ ప్రభావం ప్రపంచ దేశాలపై పెరుగుతుందే తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. ఈ నేపథ్యంలో రోజురోజుకు ప్రజల్లో ప్రాణభయం పాతుకు  పోతుంది. అయితే కరోనా వైరస్ ప్రభావం ఉన్న దేశాలు అప్రమత్తం అయ్యి  ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ ప్రజలందరినీ ఇంటికే పరిమితం చేసినప్పటికీ... కరోనా  వైరస్ ప్రభావం మాత్రం రోజురోజుకూ పెరిగిపోతునే  ఉంది. ఇక ఈ వైరస్ కు  సరైన విరుగుడు కూడా లేకపోవడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 

 

 

 ఇక రోజురోజుకు వైరస్ ప్రభావం పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యక్తిగత సంరక్షణకు ఉపయోగించే మాస్క్ లు  తదితర సంరక్షణ వస్తువుల కొరత ఒక్కసారిగా పెరిగిపోయింది. కరోనా వైరస్ తో రాకుండా ఎక్కువ మంది గ్లౌజులు ఉపయోగిస్తుండడంతో ఈ కొరత  ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే కరుణ వైరస్ పై  యుద్ధం చేసి తరిమికొట్టేందుకు ప్రపంచ టెక్  కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. తాజాగా ఈ టెక్ కంపెనీల జాబితాలోకి ఫేస్బుక్ కూడా వచ్చి చేరింది. ఎమర్జెన్సీ లో ఉపయోగించేందుకు వీలుగా 7.2 లక్షలు  మాస్క్ లు  విరాళంగా పంపినట్లు ఫేస్బుక్ చీప్ మార్క్ జుకర్బర్గ్ వెల్లడించారు. 

 

 

 మరోవైపు తాము ఇప్పటికే సిద్ధం చేసి పంపిన ఫేస్ మాస్కులు రవాణా మధ్యలో  నిలిచిపోయింది టెస్లా  చీప్ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. మరోవైపు ఫేస్బుక్ జర్నలిజం ప్రాజెక్టు విభాగం కూడా.. ప్రాణాంతకమైన కరోనా  వైరస్ పై  రిపోర్టింగ్ కోసం ఏకంగా మిలియన్ డాలర్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలకు ఫేస్ మాస్క్ లను అత్యవసర సంరక్షణ వస్తువులను విరాళంగా అందజేస్తూ కరోనా  వైరస్ పై  పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: