తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితులు చేయి దాటి పోకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలను చేపడుతుంది. తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్రంలో కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు అకుంటిత  దీక్షతో శ్రమిస్తోంది. దీని కోసం ప్రజల సహకారం కూడా కావాలి అని తెలంగాణ సర్కార్ కోరుతుంది. ఇప్పటికే జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలను  అన్నిటినీ మూసివేస్తే సంచలన నిర్ణయం తీసుకున్నది  తెలంగాణ సర్కార్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్... మార్చి 31 వరకూ జనతా కర్ఫ్యూను పాటించాలని లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. 

 

 

 ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలి అంటూ సూచిస్తున్నారు. ఇలా ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ప్రజలకు ఎక్కడ కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు చర్యలు చేపడుతుంది తెలంగాణ సర్కార్. ఇదిలా ఉంటే కరోనా వైరస్ కు సంబంధించి మారుమూల గ్రామాల్లో వింత  ప్రచారం జరుగుతుంది. కరోనా  వైరస్ తగ్గడానికి కొన్ని వింత ప్రచారాలు మొదలై పోయాయి. ఒకరు లేదా ఇద్దరు కొడుకులు ఉన్న తల్లులందరూ... ఐదు ఇళ్ల నుంచి తీసుకు వచ్చిన నీటిని వేపచెట్టుకు పోయడం ద్వారా.. కరోనా  వైరస్ దరిచేరదు అంటూ ఓ ప్రచారం గ్రామాల్లో ఊపందుకుంది. ఈ క్రమంలో ఈ ప్రచారాన్ని నమ్మిన  గ్రామాల్లో మహిళలు ఒక కొడుకు ఉంటే ఒక కొబ్బరికాయ ఇద్దరు కొడుకులు ఉంటే రెండు కొబ్బరికాయలు వేప చెట్టుకు కొడుతున్నారు. 

 

 

 ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఏకంగా సోషల్ మీడియా లోకి వచ్చింది . ఇక ఇది అధికారుల వరకు వెళ్లడంతో దీనిపై అధికారులు స్పందించారు. అదంతా అసత్య ప్రచారమని ప్రజలు ఇలాంటి వాటిని నమోదు అంటూ సూచిస్తున్నారు ప్రజా ప్రతినిధులు, అధికారులు.  మూఢనమ్మకాలతో కరోనా  వైరస్ ను  కోరి తెచ్చుకోవద్దు అంటూ సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ఎవరి ఇళ్లలో వారు ఉంటేనే మంచిది అని చెబుతున్నారు. ఇక గ్రామాల్లో ప్రజలందరికీ మూఢనమ్మకాల పై అవగాహన కల్పించాలని యువకులను  కోరుతున్నారు ప్రజాప్రతినిధులు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: