భారత దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కోరలు  చాస్తూ చిరు వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. దీంతో ప్రభుత్వాలు అధికారులు సామాన్య ప్రజలు సెలబ్రెటీలు ఇలా అందరూ తీవ్ర ఆందోళన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఎవరి నుండి ఎటు నుండి కరోనా  దాడి చేసి మృత్యువుతో పోరాటం చేసేలా చేస్తుందో  అని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడ కరోనా  వైరస్ నియంత్రణ మాత్రం జరగడం లేదు. రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. 

 

 

 దీంతో భారత దేశ వ్యాప్తంగా కరోనా  విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారిపోతుంది. భారతదేశంలో మొత్తం కరోనా  వైరస్ బారిన పడిన వారి సంఖ్య 500 కు చేరింది. ఇక ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరిగి పోతుండటంతో ప్రజలు ప్రాణ భయంతో చిగురుటాకులా వణికిపోతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఈ కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర కేరళ రాష్ట్రాలలో ఈ మహమ్మారి వైరస్ విజృంభిస్తోంది. భారతదేశంలో అత్యధికంగా ఈ రెండు రాష్ట్రాలలో ఎక్కువమంది కరోనా  వైరస్ బారిన పడిన వారు ఉన్నారు. ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో పరిస్థితి చేయి దాటిపోతున్న  తరుణంలో... ప్రజలు తీవ్ర ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

 

 

 ఇప్పటి వరకు భారతదేశంలో ఏకంగా కరోనా  వైరస్ సోకిన వారిలో 10 మంది మృతి చెందారు. చికిత్స పొందుతూ మహమ్మారి వైరస్ ను  జయించలేక మృత్యుఒడిలోకి వెళ్ళిపోయారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 33 కు చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ మహమ్మారి వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఏడుకు చేరింది. ఇలా రోజురోజుకు మహమ్మారి వైరస్ విజృంభిస్తూ  ఎంతోమందిని మృత్యువుతో పోరాడేలా చేస్తుండడంతో ప్రజలు రోజురోజుకు భయం పెరిగిపోతూనే ఉంది. కంటికి కనిపించని శత్రువు ఎటునుంచి దాడిచేసి మృత్యువు  వైపు నడిపిస్తుదోనని ప్రాణభయం తో  ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతున్నారు భారత ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: