గత కొన్ని రోజుల నుంచి భారతదేశంలో ప్రముఖులందరూ చర్చించుకున్న మాట... కేంద్ర ప్రభుత్వం భారత్ లో  ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటిస్తుంద... దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 360 ఆశ్రయిస్తుందా  అనే చర్చ సాగుతోంది. కారణం గత కొన్ని రోజుల నుండి భారత దేశ వ్యాప్తంగా కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం. ఇక రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా  వైరస్ ప్రభావం కారణంగా... కేవలం మనుషుల ప్రాణాలు పైన ప్రజల పైన ఎఫెక్ట్ పడడమే కాదు వివిధ రంగాల పై కూడా పడింది. అంతే కాకుండా ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిర్బంధం కొనసాగుతున్న నేపథ్యంలో... ఈ ఎఫెక్ట్ భారత ఆర్థిక వ్యవస్థపై మరింతగా పడింది. ఇప్పటికే ఆర్థిక మందగమనంతో కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థ... కరోనా ఎఫెక్ట్ తో అన్ని రంగాలు నష్టాన్ని చవి చూస్తున్న నేపథ్యంలో మరింతగా దిగజారిపోయింది. 

 

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 360 ఆశ్రయించి దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశం ఉంది అని గత కొన్ని రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. ఇక దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉంటుందా లేదా కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది అనే దానిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్... ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా ఈ సందర్భంగా వివరించారు. 

 

 జూన్ 30 వరకు ఐటీ రిటర్న్స్ గడువు పొడగిస్తూన్నామని తెలిపిన నిర్మల సీతారామన్...ఒకవేళ ఐటీ రిటర్న్స్ ఆలస్యమైతే 9%  ఫైన్ విధిస్తామని  తెలిపారు. పన్నుల చెల్లింపు ల పై అనేక వెసులుబాట్లు కల్పిస్తున్నాము అంటూ ఈ సందర్భంగా తెలిపారు నిర్మల సీతారామన్. అయితే దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే ఉద్దేశం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది అంటూ ఈ సందర్భంగా వెల్లడించారు. అంతే కాకుండా ఆధార్ కాదు పాన్ కార్డ్ లింకింగ్ గడువు కూడా జూన్ 30 వరకు పెంచుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న లాక్ డౌన్  కరోనా  వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అంటూ తెలిపారు నిర్మల సీతారామన్. ఆర్థిక ప్యాకేజీ పై వర్కౌట్ చేస్తున్నామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: