కరోనా ప్రభావంతో వణుకుతున్న ప్రజలకు భయాన్ని పోగొట్టేందుకు జనతా కర్ఫ్యూని అమలులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది. అందుకే ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. అంతేకాకుండా ప్రజలను బయటకు ఎట్టిపరిస్థితుల్లో రావొద్దని కఠిన చర్యలను చేపట్టింది. అందుకే ప్రజలు కూడా కరొనను నియంత్రించే దిశగా సాగుతున్నారు. 

 

 

ఈ కరొనను పూర్తిగా నియంత్రించడానికి  జనతా కర్ఫ్యూని విధించారు. అందుకే ప్రజల్లో ఈ కరోనా భయాన్ని పోగొట్టడానికి ప్రభుత్వం జనతా కర్ఫ్యూని చేపట్టింది. అందుకే గత రెండు రోజుల నుంచి అనేక ప్రజలు స్వచ్చందంగా బంద్ ను కొనసాగిస్తున్నారు. ఎన్ని చర్యలు చేపట్టిన కరోనా ప్రభావం లేదని లాక్ డౌన్ ను ప్రభుత్వం ప్రకటించింది. 

 

 

 

ఇందులో భాగంగా ప్రజలు ఏప్రిల్ 14 వరకు ఇంటి నుంచి బయటకు రావవద్దని సూచింది. అలాగే ప్రజలు ఒకవేళ వస్తే కఠిన చర్యలు తప్పవని సూచించింది. అయినా కూడా ప్రజలు ఏ మాత్రం లెక్క చేయకుండా బయటే తిరుగుతున్నారు. ఇకపోతే హైదరాబాద్ నగరంలో ఉంటున్న ప్రజలను వారి ప్రాంతాలకు పంపించేలా అన్నీ మార్గాలను ప్రభుత్వం చేపడుతుంది. 

 

 

 

హైదరాబాద్‌లోని అమీర్‌పేట, పంజాగుట్ట సహా సమీప ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉంటున్న యువతీయువకుల ఆందోళనకు పోలీసులు దిగొచ్చారు. వారు ఎటువంటి ఆటంకం లేకుండా స్వగ్రామాలకు వెళ్లేందుకు పాసులు జారీ చేశారు. మూడువారాలపాటు దేశంలో లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో హాస్టళ్లను ఖాళీ చేయాలంటూ అమీర్‌పేట, పంజాగుట్ల ప్రాంతాల్లోని ఆయా హాస్టళ్ల యజమానులు యువతీయుకులపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఆందోళన చెందిన యువతీయువకులు ఈ రోజు ఆందోళనకు దిగారు. 

 

 

బస్సులు, రైళ్లు అన్నీ బంద్ ఉంటే ఇప్పటికిప్పుడు తామెక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తూ పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన పోలీసులు వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వగ్రామాలకు వెళ్లేందుకు వీలుగా పాసులు మంజూరు చేశారు. చెక్‌పోస్టుల వద్ద వారిని అడ్డుకోకుండా ఈ పాసులు మంజూరు చేసినట్టు డీసీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: