కొరోనా వైరస్ బాధిత దేశాల్లో మిగిలిన దేశాలను అమెరికా మించిపోతుందా ? ఇపుడిదే టెన్షన్ అందరిలోను పెరిగిపోతోంది. అమెరికాలో వైరస్ వ్యాపిస్తున్న స్పీడు చూస్తుంటే యావత్ ప్రపంచం విస్తుపోతోంది. మొదటి రెండు వారాల్లో అమెరికా మొత్తం మీద రెండంటే రెండు కేసులే నమోదైంది. విచిత్రమేమంటే తర్వాత రెండు వారాల్లో 50 వేల కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని టెక్సాస్ హెల్త్ సైన్సెస్ లో సీనియర్ డాక్టర్ గా పని చేస్తున్న జయరాం నాయుడు స్వయంగా చెప్పారు. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం అమెరికాలో వైరస్ ఎంత స్పీడుగా విస్తరిస్తోందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెరికాలో 80 వేల కేసులు నమోదయ్యాయి.

 

గడచిన 46 సంవత్సరాలుగా ప్రాక్టీసు చేస్తున్న జయరాం నాయుడు ఇటువంటి పరిస్ధితిని ఎప్పుడూ చూడలేదంటున్నారు. వైరస్ ఇంత స్పీడుగా ఎందుకు వ్యాపిస్తోందో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. వైరస్ నియంత్రణ కోసం ఆసుపత్రులనే కాకుండా అమెరికా ప్రభుత్వం ఫుట్ బాల్ గ్రౌండ్లు, హోటళ్ళను కూడా స్వాధీనం చేసేసుకుంది. ఎక్కడ అవకాశం ఉంట అక్కడల్లా ఐసొలేషన్ వార్డులను, క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసేస్తోంది. ముందు జాగ్రత్తగానే వేలాదిమంది డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసినా వైరస్ కంట్రోల్ కావటం లేదు.

 

న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటిలో డాక్టర్ కుమార్ మాట్లాడుతూ న్యూయార్క్ లో 30 వేల కేసులు నమోదైనట్లు చెప్పారు. వీరిలో పరిస్ధితి సీరియస్ గా ఉన్న కారణంగా 3800 మందిని ఆసుపత్రుల్లో చేర్చగా మళ్ళీ ఇందులో సుమారు వెయ్యిమంది ఐసియుల్లో ఉన్నట్లు కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ దెబ్బకు న్యూయార్క్ లాక్ డౌన్ చేసేశారు. రోజుమొత్తం మీద కొన్ని గంటలు మాత్రమే జనాలకు నిత్యావసరాలు కొనుకునేందుకు బయటకు అనుమతిస్తున్నారట. ఆయన పని చేస్తున్న కొలంబియా యూనివర్సిటిలో  4500 మంది ఉంటే వెయ్యిమందికి కొరోనా వైరస్ ఎటాక్ అయ్యిందట.

 

అమెరికాలోనే పరిస్ధితి ఇలాగుంటే ఇక మనదేశం సంగతి చెప్పనే అక్కర్లేదు. అన్నీ విధాలుగాను ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికాలోనే వైరస్ ఇంత స్పీడుగా విస్తరిస్తుంటే ఇదే స్పీడు మనదేశంలో కూడా ఉంటే ఇంకేమైనా ఉందా ? ఇందుకే మూడు వారాలపాటు ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించింది.  కాబట్టి మనం అమెరికా పరిస్ధితిలోకి వెళ్ళకూడదంటే ముందు జాగ్రత్తలే శరణ్యమని గ్రహించాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: