కరోనా వైరస్ లేదా కోవిడ్‌-19.. ఇప్ప‌టికే ఎంద‌రో అమాయ‌కుల ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. మూడు అక్షరాలే అయినా ముచ్చెటమలు పట్టిస్తోంది. మొదట చైనాను అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాలను వణికిస్తోంది. కోవిడ్ దెబ్బకు ఇటలీ చిగురుటాకులా వణికిపోతోంది. భార‌త్‌లోనూ దీన్ని వేగాన్ని పుంజుకుంటూ పోతోంది. ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఎలాంటి మందు లేదు. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయాలంటే వ్యాక్సీన్ కనిపెట్టాల్సిన అత్యవసర పరిస్థితి. ఇప్పటికే ప్రపంచ దేశాల సైంటిస్టులు కరోనా వ్యాక్సీన్ కనిపెట్టేందుకు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. 

 

కానీ, ఇప్పటివరకూ కరోనా మందును కనిపెట్టలేకపోయారు. ఇక నివారణకు ముందు జాగ్రత్తలు తీసుకుంటోన్నా లోలోపల భయం ప్రపంచాన్ని వెంటాడుతోంది. కల్లోల కరోనా కంట్రోల్ కోసం దేశాలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే బెంగళూరుకు చెందిన విశాల్ రావు అంకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్‌కు మందు కనుక్కొన్నామని తాజాగా పేర్కొన్నారు.  ఇంటర్ఫెరాన్ ప్రోటీన్‌తో కూడిన స‌మ్మేళ‌నం క‌రోనా ర‌క్కసికి చెక్ పెట్ట‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని ప్ర‌ముఖ క్యాన్స‌ర్ వైద్య నిపుణులు విశాల్‌ రావు వెల్ల‌డించారు. 

 

వాస్త‌వానికి మానవ శరీర కణాలు వైరస్‌లను చంపడానికి ఇంటర్ఫెరాన్ రసాయనాన్ని విడుదల చేస్తాయని, అయితే కోవిడ్‌-19 విష‌యంలో మాత్రం ఇవి ప‌నిచేయండం లేద‌ని , అంతేకాకుండా రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌హీన‌ప‌రుస్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. `రెగ్యుల‌ర్ చెకప్‌లో భాగంగా మనుషుల ర‌క్త నమూనాలను సేక‌రించిన‌ప్పుడు బప్ఫీకోట్ అనే ప‌దార్థం ఉత్న‌న్న‌మ‌వుతుంది. దీని నుంచే ఇంటర్ఫెరాన్ అనే ప్రోటీన్ ఉత్ప‌త్తి అవుతుంది. ఇది రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి తోడ్ప‌డుతుందని గుర్తించిన‌ట్లు వెల్లడించారు.

 

ఈ రెండింటికీ సైటోకిన్లతో కూడిన ఒక స‌మ్మేళ‌నాన్ని జోడించి చికిత్స అందించ‌డం ద్వారా ఇది క‌రోనాపై శ‌క్తిమంతంగా పోరాడ‌గ‌లద‌ని న‌మ్ముతున్నామ‌ని.. ఇప్ప‌టికే దీని గురించి రాష్ర్ట ప్ర‌భుత్వానికి తెలియ‌జేశాం’ అని డాక్ట‌ర్ విశాల్‌రావు వెల్ల‌డించారు. వైరస్ ప్రబలిన రోగుల్లో సైటోకిన్‌‌ను రోగుల్లో ఇంజెక్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఇది వైరస్ నిర్మూలన ప్రారంభ దశ అని.. వారంలోగా తుది దశకు చేరుకుంటామని వివరించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: