కరోనా వైరస్ ను ఆషామాషీగా తీసుకుంటే అంత తేలిగ్గా తీసుకుంటే ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసే అవకాశం లేకపోలేదు. ఈ పెను విపత్తుకు ప్రపంచ దేశాలు అల్లాడి పోతున్నాయి. ప్రస్తుతం దీనికి నివారణ మార్గంగా ఒకరికి ఒకరికి మధ్య దూరం పాటించడం, ముఖానికి మాస్క్ పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా కడుక్కుంటూ, వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం అవ్వడం ఒక్కటే ఈ కరోనా వైరస్ వ్యాప్తిని మరింత వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేసే మార్గంగా ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ను చాలా సీరియస్ గా అమలు చేస్తున్నాయి. అయినా కొంతమంది మాత్రం దీనిని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. మత విశ్వాసాలతో ఈ వ్యాధిని తేలిగ్గా తీసుకుంటూ, మరింత ఉదృతం అయ్యేందుకు కారకులవుతున్నారు. 

 

IHG


తాజాగా కరోనా వైరస్ సోకి 70ఏళ్ల సిక్కు మత గురువు బలదేవ్ సింగ్ మరణించడం అందరికీ భయాందోళనలు కలిగిస్తోంది. ఎందుకంటే ఆయన కొద్ది రోజుల క్రితం యూరప్ లోని ఇటలీ, జర్మనీ దేశాలకు వెళ్లి వచ్చారు. ఆ తరువాత భారత్ కు చేరుకున్న ఆయన విశ్రాంతి తీసుకోకుండా పన్నెండు గ్రామాల్లో మత ప్రచారంలో భాగాంగా పంజాబ్ లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అయితే ఆయనకు కరోనా పాజిటివ్ రావడం, అనారోగ్యంతో ఆయన మరణించడంతో ఆయన తిరిగిన అన్ని గ్రామాలను ఇప్పుడు క్వారంటైన్ లో పెట్టేసారు. పంజాబ్ రాష్ట్రంలో ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది. ఆయన ద్వారా ఎంతమందికి ఈ వైరస్ సోకింది అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. 

 


ప్రాథమిక అంచనా ప్రకారం బలదేవ్ సింగ్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారు 1500 మంది వరకు ఉన్నారని, అధికారులు గుర్తించారు. వారందరికీ కరోనా వ్యాపించే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తునాన్రు. ఇప్పటికే బలదేవ్ సింగ్  ఇద్దరి శిష్యులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో పంజాబ్ లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికీ ఆయన్ను కలిసిన 19 మంది వ్యక్తులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇంకా 200 మంది వరకు ఈ లక్షణాలు ఉన్న ట్లుగా అనుమానిస్తున్నారు. వారి రిపోర్టులు కూడా ఇంకా రావాల్సి ఉంది. భారతదేశంలోని ఒక వ్యక్తి కారణంగా ఇంతమంది ఇబ్బందుల్లో పడిన సంఘటన ఇదేనట.

మరింత సమాచారం తెలుసుకోండి: