తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి  రైతులకు శుభవార్త వినిపించారు. రాష్ట్రంలో పండించే ప్రతి పంట కొనుగోలు చేస్తామని తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వరి మొక్కజొన్న పంటలకు మద్దతుధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అంటూ తెలిపారు. అంతేకాకుండా ధాన్యాన్ని విక్రయించుకునే రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా  వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో... అన్ని కొనుగోలు కేంద్రాలు మూసి వేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 

 

 

 అయితే రైతులకు ప్రభుత్వం ఇచ్చే కూపన్  ప్రకారం వారికి కేటాయించిన తేదీ రోజు మాత్రమే రైతులు ధాన్యం మార్కెట్ యార్డ్ తీసుకురావచ్చు అని  స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ కోసం  కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అయితే అధికారులు నేరుగా రైతుల వద్దకు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు కాబట్టి.. ధాన్యం నిల్వ చేసే గోనె సంచుల అవసరం కూడా పెద్దగా ఉండదు అంటూ తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. 

 

 

 ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందనీ తెలిపారు . అయితే దాణ్యం  కొనుగోలు ప్రక్రియలో హమాలీలు  ఎంతో ముఖ్యం.   ఎక్కువగా హమాలీలు బీహార్ రాష్ట్రం నుంచి వస్తారన్న  విషయం తెలిసిందే. ధాన్యం సేకరణ, మిల్లర్లకు  చేర్చడం లాంటి ప్రక్రియకు బీహార్ నుంచి కూలీలను రప్పించాల్సిందే అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.  ధాన్యం సేకరణ మిల్లర్లకు చేర్చడం  లాంటి ప్రక్రియలో  బీహార్ కూలీల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు . హమాలి కూలీల అందరూ హోలీ పండుగ నిమిత్తం బీహార్ రాష్ట్రానికి వెళ్లారు. వాళ్లు వస్తే నేను పనీ నడుస్తుందని వాళ్ళని త్వరలో రప్పిస్తాం  అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: