అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తూ ఉండటం, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు వారాల్లో మరణాల రేటు భారీగా పెరగనుందని అన్నారు. ఏప్రిల్ 30 వరకు కరోనా మహమ్మారి కట్టడి కొరకు చేపట్టిన ఆంక్షల్ని పొడిగిస్తున్నామని ప్రకటన చేశారు. అప్పటివరకూ ప్రజలంతా సామాజిక దూరం పాటించి కరోనా కట్టడి కోసం కృషి చేయాలని అన్నారు. 
 
గతంలో ట్రంప్ దేశంలో మరికొన్ని వారాల్లో పరిస్థితులు యథాతథ స్థితికి చేరుకుంటాయని ప్రకటన చేశారు. కానీ దేశంలో ఆ దిశగా పరిస్థితులు లేవని తాజాగా ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికాలో 15 రోజుల పాటు జనసంచారంపై ఆంక్షలు విధించిన ట్రంప్ నేటితో ఆ గడువు ముగియడంతో మరో నెల రోజుల పాటు ఆంక్షలు కొనసాగనున్నట్లు ప్రకటన చేశారు. అమెరికా ఆరోగ్య శాఖ నిపుణుడు ఆంథోనీ పాసీ కరోనా లక్ష మంది ప్రాణాలను బలి తీసుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. 
 
అమెరికాలో ఇప్పట్లో వైరస్ బెడద తొలగిపోయే అవకాశం లేదని అక్కడి వైద్యులు చెబుతున్నారు. అమెరికాలో ఇప్పటివరకు 1,44,226 మంది కరోనా వైరస్ భారీన పడ్డారు. వీరిలో 4,443 మంది కరోనా నుండి కోలుకోగా 2,493 మంది మృత్యువాత పడ్డారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, నియంత్రణ చర్యలు పటిష్టంగా లేకపోవడంతో అమెరికాలో కరోనా వేగంగా వ్యాపించింది. కరోనా వైరస్ పుట్టిన చైనాలో కంటే అమెరికాలోనే ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
కరోనా వైరస్ ధాటికి అమెరికా అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే 185 దేశాలు కరోనా భారీన పడ్డాయి. 15 దేశాల్లో కరోనా తీవ్రస్థాయిలో ఉంది. మరోవైపు ఇటలీలో కూడా పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఇప్పటివరకూ 97,689 కేసులు ఇటలీలో నమోదు కాగా 10,779 మంది మృతి చెందారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: