ప్రపంచం మొత్తం కష్టతరమైన పరిస్దితులను ఎదుర్కొంటుంది ఇలాంటి సమయంలో రోడ్దు మీద కానీ, ఇంటి పక్కన ఉన్న వారిని కానీ అనుమానించే స్దితిలో ప్రజలు బ్రతుకుతున్నారు.. ఇక ముందు ముందు ఈ జీవితాన్ని గడపాలంటే ఎన్ని కఠినమైన కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుందో తెలియదు.. ఇలాంటి సమయంలో ఎంతో బాధ్యతగా సేవలు అందించే వారిలో హస్పిటల్ సిబ్బంది గురించి ఎంత చెప్పిన తక్కువే.. వీరిలో వైద్యులు, నర్సులు, మరియు ఇతర సిబ్బంది.. వీరంత కలిసి కట్టుగా కరోనాతో పోరాటం చేస్తున్న వారికి మనోధైర్యాన్ని ఇస్తూ, వారి సేవలు అందిస్తున్నారు.. ఇలా చేసే ప్రతి వారిని దైవాలుగా పూజించిన తప్పులేదు..

 

 

ఇకపోతే ఒక వైద్యురాలి విషయంలో అధికారులు స్పందించిన తీరు.. నిజంగా వైద్య వృత్తికే గర్వకారణంగా నిలిచి పోతుంది.. అదేమంటే కరోనాను నియంత్రించేందుకు యూఏఈ ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. అందువల్ల ఎవరు రోడ్లపై కనిపించే వీలు లేదు.. ఈ పరిస్దితుల్లో శనివారం రాత్రి 2 గంటల సమయంలో రస్ అల్ ఖైమా పోలీసులు ఓ కారును ఆపారు. కాగా ఈ తతంగాన్నంతా రస్ అల్ ఖైమా స్పెషల్ ఫోర్సెస్ డైరెక్టర్ యూసఫ్ అల్ జాబి, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి లైవ్‌లో గమనిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఆ కారును ఎందుకు ఆపారంటూ ప్రశ్నించారు అక్కడ ఉన్న పోలీసు అధికారిని.. డాక్యుమెంట్లు చూడటానికి ఆపానని.. ఈ కారు నడుపుతోంది వైద్యురాలు అని, ఆమె షిప్టు పూర్తి కావడంతో ఇంటికి వెళ్తోందంటూ తన పై అధికారికి తెలియజేశారు.

 

 

ఇది విన్న ఆ అధికారి యూసఫ్ తాను చెప్పే మెసేజ్‌ను వైద్యురాలికి అందించమని కోరారు. వెంటనే అక్కడున్న పోలీసు అధికారి అతని దగ్గర ఉన్న రేడియోను ఆమెకు అందించాడు.. ఇంతకు తాను ఏం చెప్పారంటే.. ‘యూఏఈ మొత్తం మీ లాంటి వైద్యులను, మీ సహోద్యోగులను చూసి గర్వపడుతోందని చెప్పారు. ఈ మాటలను విన్న వైద్యురాలు వెంటనే ఆనందంతో కన్నీటి పర్యంతమైంది. అనంతరం వైద్యురాలికి అధికారి సెల్యూట్ చేస్తూ ఆమెను పంపించేశారు.. నిజమే కదా.. ప్రస్తుత పరిస్దితుల్లో ఈ ప్రమాదకరమైన వైరస్‌తో ముఖాముఖిగా యుద్ధం చేస్తుంది ఆస్పత్రి సిబ్బందే.. ఈ విషయాన్ని ఎవరైన ఒప్పుకోక తప్పదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: