నిత్యం భక్తజనంతో కిటకిటలాడే తిరుమల కొండలు....ఇప్పుడు వన్యమృగాల సంచారంతో సందడిగా మారుతోంది. శ్రీవారి ఆలయంలో గత నెల 20 వతేదీ నుంచి భక్తులను దర్శనానికి అనుమతించకపోవడంతో...... తిరుమల మొత్తం నిర్మానుష్యంగా  మారిపోవడంతో .... వన్యప్రాణులు రోడ్ల పైకి వచ్చేస్తున్నాయి.  

 

కలియుగ వైకుంఠ నాథుడి సన్నిధిలో ఇప్పుడు భక్తులు రాక లేకపోవడంతో వన్యమృగాల సంచారం పెరుగుతోంది. నిత్యం భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మోగే తిరుమలలో కరోనా వైరస్ వ్యాపించకూండా టిటిడి ముందు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భాగంగా గత నెల 20 నుంచి భక్తుల్ని దర్శనానికి అనుమతించడం లేదు. అటు తరువాత దేశమంతా లాక్ డౌన్ ప్రకటించడంతో గత నెల 24  నుంచి  రెండు ఘాట్ రోడ్డులను మూసివేసింది టిటిడి. దీంతో తిరుమలకు వచ్చే వాహనాలు సంఖ్య కూడా తగ్గిపోయింది. టిటిడి ఉద్యోగులకు వారం రోజుల పాటు తిరుమలలోనే విధులు కేటాయిస్తూండడంతో.... ఘాట్ రోడ్లు కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి.

 

ఇదే సమయంలో శేషాచలం కొండల్లో ఉన్న జంతువులన్నీ ఇప్పుడు తిరుమలలో ప్రవేశిస్తున్నాయి. జింకలు మొదలుకుని....వరాహాలు, దుప్పి, ఎలుగుబంట్లు, ఏనుగులు ....చిరుతలు యద్దేచ్చగా సంచరిస్తూన్నాయి. కొద్ది రోజుల క్రితం మాడ వీధుల్లోకి జింకలు రాగా.... తాజాగా వరాహాలు ప్రవేశించాయి. ఇక శ్రీవారి ఆలయ సమీప ప్రాంతంతో పాటు ఘాట్ రోడ్డులో చిరుతల సంచారం పెరగగా.... పార్వేటి మండపం వద్ద గజరాజులు గుంపుగా ప్రత్యక్షమయ్యాయి.

 

ఇక టోల్ గేట్ సమీప ప్రాంతంలో ఎలుగుబంట్లు.... ఘాట్ రోడ్డులో జింకల గుంపు.... ఇలా స్వేచ్చగా సంచరిస్తూన్నాయి . జనసంచారం లేకపోవడంతో విధుల్లో వున్న భధ్రత సిబ్బందిలో మాత్రం ఆందోళన నేలకొంటోంది. తిరుమల కొండలు నిర్మానుష్యంగా ఉండటంతో.. విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాల్సిఉంది.  భక్తులు సందడి పెరిగే వరకు.... పరిస్థితి ఇలానే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: