ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ సంబంధాల వల్ల కొందరి కాపురాలు కూలిపోతుంటే.... మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏపీలోని విజయనగరం జిల్లాలో వివాహేతర సంబంధం వ్యవహారంలో ఒక వ్యక్తి భార్యను దారుణంగా హత్య చేశాడు. విజయనగరం జిల్లా సాలూరులోని కోట వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
పూర్తివివరాలలోకి వెళితే కోట వీధికి చేందిన బొర్రా పావని వారం రోజుల క్రితం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మహిళ భర్త తిరుపతిరావును విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాలూరుకు చెందిన తిరుపతిరావుకు తొమ్మిదేళ్ల క్రితం శంబరకు చెందిన పావనితో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. 
 
ఉపాధి నిమిత్తం కొన్ని సంవత్సరాలు చెన్నైలో జీవించిన దంపతులు గతేడాది సాలూరుకు వచ్చారు. ఆ తర్వాత వారిని సాలూరులోనే ఉంచి తిరుపతిరావు ఉపాధి నిమిత్తం చెన్నైకు వెళ్లాడు. పావని అదే సమయంలో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తిరుపతిరావుకు తెలియడంతో దంపతుల మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. 
 
పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోగా పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. లాక్ డౌన్ వల్ల కొన్ని రోజుల క్రితం తిరుపతిరావు ఇంటికి వచ్చాడు. అదే సమయంలో తిరుపతిరావు పావని ప్రియుడిని కలిసేందుకు వెళుతుందని తెలిసి ఆమె కాళ్లూచేతులు కట్టేసి యాసిడ్ తాగించాడు. అప్పటికీ పావని చనిపోకపోవడంతో ఆమె ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు జరపగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తిరుపతిరావు హంతకుడని తేలడంతో అతడిని అరెస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: