భారత దేశానికి స్వాతంత్రం సాధించడం కోసం చేసిన పోరాటంలో ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమైనది.... భారత దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ తుపాకులకు ఎదురు నిలబడే వందల సంఖ్యలు  ప్రాణాలు వదిలిన ఘటన... భారతదేశం మొత్తాన్ని ఉలికిపాటుకు గురిచేసింది దుర్ఘటన. హేయమైన ఈ  ఘటన జలియన్  వాలాబాగ్ ఉదంతం. నాటి బ్రిటిష్ పాలకులు దుశ్చర్యకు నిలువుటద్దంగా నిలిచి.. ప్రజల్లో బ్రిటిష్ వాళ్ళ పై మరింత వ్యతిరేకత తీసుకొచ్చిన సంఘటన జలియన్  వాలాబాగ్ ఉదంతం. బ్రిటిష్ వాళ్ళ నిరంకుశత్వానికి రాక్షసత్వానికి వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ee ఘటనలో . చిన్న పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అతి దారుణంగా కాల్చి చంపారు. అమృత్సర్ పట్టణంలోని తోట జలియన్  వాలాబాగ్. ఇక పంజాబీలకు  అత్యంత ముఖ్యమైన వైశాఖ  ఉత్సవం సందర్భంగా వేలాది మంది 1919 ఏప్రిల్ 13 వ తేదీన జలియన్వాలాబాగ్ కు చేరుకున్నారు. 

 

 

 అయితే దీని ఉత్సవాలను నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్  చట్టం ప్రకారం వ్యతిరేకిస్తూ జాతీయోద్యమకారులు  సైతం ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అయితే ప్రజలను అనగా తొక్కడం లో భాగంగానే బ్రిటిష్ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ ఉత్సవాలు  జరుగుతున్న సమయంలో అప్పటి జనరల్ రెజినాల్డ్  డయ్యర్ సారథ్యంలో ని బ్రిటీష్ సైన్యం అక్కడ ఉత్సవాల్లో పాల్గొన్న  అమాయకుల  పై తుపాకీ ఎక్కుపెట్టి విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. బ్రిటిష్ సైన్యానికి చెందిన 50 మంది సైనికులు ... పదినిమిషాల పాటు 1650 కాల్పులు జరిపారు.. 

 

 

 అక్కడ నుంచి ఎవరూ తప్పించుకోకుండా ఉండేందుకు వివిధ మార్గాలు కూడా మూసి వేసి ... చుట్టూ రౌండప్ చేసి జనం పై బులెట్ వర్షం కురిపించారూ. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ దుర్ఘటనలో 379 మంది మరణించారు అని చెప్పినప్పటికీ వాస్తవంగా అయితే 1000 మందికి పైగా మరణించగా రెండు వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.హఠాత్పరిణామంతో  భయాందోళనకు గురైన ప్రజలు నిష్టాతులయ్యారు... బయటకు వెళ్లి తప్పించుకోవడానికి కూడా వీలులేని పరిస్థితి ఉండటంతో ప్రాణాలు విడిచారు. కాగా  ఈ మారణ కాండ బ్రిటిష్  చరిత్రలోనే సిగ్గుచేటుగా నిలిచింది . ఈ దురాగతాన్ని ఓ బాధాకరమైన ఉదాహరణగా ఎంతో మంది ప్రముఖులు పేర్కొన్నారు. ఏదేమైనా 1919 ఏప్రిల్ 13 జరిగిన జలియన్ వాలాబాగ్ ఘటన మాత్రం భారత ప్రజలందరికీ ఒక పీడకల లాంటిదే.

మరింత సమాచారం తెలుసుకోండి: