ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితి రోజు రోజుకు దారుణంగా  మారిపోతుంది. ఎక్కడి నుంచి రూపాయి ఆదాయం లేక పరిస్థితి చెప్పుకో లేకుండా ఉంది . ముఖ్యంగా సినీ పరిశ్రమ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మామూలుగా అయితే సినీ పరిశ్రమలో  నిర్మాతలు కోట్లకు కోట్లు సంపాదిస్తారు. సినీ పరిశ్రమలోని నిర్మాతలకు లాభాలు సంపాదించాలంటే సినిమాలు ఆడాలి. కానీ ప్రస్తుతం లాక్ డౌన్  నేపథ్యంలో చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా షట్ డౌన్  అయింది. అన్ని చిత్ర షూటింగ్ లు  ఆగిపోయాయి.. సినిమా థియేటర్ లు అన్ని  మూసివేయడంతో అటు  విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు విడుదల కూడా వాయిదా పడింది. మరోవైపు సినిమా నిర్మాణం కోసం తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగి పోతున్నాయి. దీంతో లాక్ డౌన్  సమయంలో నిర్మాతల  కష్టాల రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 

 

 

 మే నెలలో అయినా  సినిమా థియేటర్లు తెరుచుకుంటాయా... షూటింగులు  మొదలవుతాయా అన్నది కూడా చెప్పలేని పరిస్థితి. ఇకపోతే అటు లాక్ డౌన్  కు ముందు విడుదలైన కొన్ని చిన్న చిన్న సినిమాలు విడుదలయ్యాయి. విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా మాధ , పలాస 1978, రాజా  వారు  రాణి  వారు . సినిమాలు లాక్ డౌన్ కి ముందు  విడుదలయ్యాయి. కానీ  మంచిగా ఆడుతున్నాయి లాభాలు తెస్తున్నాయి అని అనుకుంటున్న తరుణంలో కరోనా  కారణంగా సినిమా థియేటర్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించటంతో... నిర్మాతలు  కాస్త అయోమయంలో పడిపోయారు. 

 

 

 ఈ క్రమంలోనే ఈ సినిమాలు అన్నిటినీ అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. ఇక వీటిని స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం లో రిలీజ్ చేసుకున్నారు చిత్రబృందం. ఇక పలాస 1978, రాజు గారూ  రాణి వారు సినిమాల నిర్మాతలు ఈ సినిమాకు ప్రమోషన్ కూడా చేసుకున్నారు. అయినా అమెజాన్ ప్రైమ్ వాళ్ళకి సినిమా అమ్మేసిన తర్వాత మల్లి  సినిమా కోసం ప్రమోషన్స్ ఏంటి అంటారా... అయితే సినిమా నిర్మాతలు పూర్తిగా ఈ సినిమాలలో అమెజాన్ ప్రైమ్ కి అమ్మలేదు. పే ఫర్ వ్యూస్  లెక్కన వారికి అమ్మేసారంట నిర్మాతలు. అందువల్ల వారు సినిమాలకు మరింత  వ్యూస్ పెరిగే విధంగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే సదరు నిర్మాతలకు రోజుకు లక్ష రూపాయల చొప్పున ఆదాయం వస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: