ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టిస్తూ  ప్రపంచదేశాల ప్రజలందరికీ ప్రాణ భయాన్ని కలిగిస్తుంది కరోనా వైరస్ .ప్రస్తుతం  ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ మహమ్మరి భయమే  కనిపిస్తుంది. కంటికి కనిపించకుండా ఎటునుంచి దాడి చేసి కాటికి తీసుకు పోతుందనే భయంతోనే ప్రపంచ దేశాల ప్రజలు బతుకుతున్నారు. ఇక ఈ వైరస్కు ఎలాంటి విరుగుడు లేకపోవడం నివారణ ఒక్కటే మార్గం అవ్వడంతో  పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిపోయింది. పాకిస్థాన్ లో  కూడా ఈ మహమ్మారి వైరస్ ప్రభావం రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం... అక్కడి ప్రభుత్వం కూడా సరైన నివారణ చర్యలు చేపట్టకపోవడంతో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. 

 

 

 ఇప్పటికే పాకిస్తాన్ దేశం కూడా నిర్బంధంలోకి వెళ్లిపోయిన తరుణంలో అక్కడ ఆహారధాన్యాల కొరత కూడా ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ప్రపంచ దేశాల సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తుంది పాకిస్తాన్ . ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్లో కరోనా  వైరస్  మృతి చెందిన ఓ మాజీ క్రికెటర్ ను  బలితీసుకుంది. ఈ మహమ్మారి బారిన పడిన పాకిస్థాన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్  జాఫర్ సర్పరాజ్  మృతి  చెందాడు. కరోనా వైరస్  లక్షణాలతో బాధ పడ్డా జాఫర్ (50) ను కరోనా  వైరస్ లక్షణాలు కనిపించడంతో మూడు రోజుల క్రితం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ లో  చేర్పించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. 

 

 

 అయితే కరోనా  వైరస్ కారణంగా మృతి చెందిన తొలి ప్రొఫెషనల్ క్రికెటర్ జాఫర్ సర్పరాజ్  కావడం గమనార్హం. ఇతను పాకిస్థాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించినప్పటికీ.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మాత్రం ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 1988 నుంచి 94 వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తన సత్తా చాటుతూ రికార్డులను  కొల్లగొట్టాడు జాఫర్ సర్ఫరాజ్. ఇక 1994 లో క్రికెట్ కు  పూర్తిస్థాయి వీడ్కోలు పలికిన జాఫర్  సర్ఫరాజ్... ఆ తర్వాత కోచ్ గా  అవతారమెత్తాడు. 2000 మధ్య సంవత్సరంలో ఫిషవర్ సీనియర్, అండర్-19 జట్టులకు  కోచ్ గా  వ్యవహరించాడు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అయిన అక్తర్ సర్పరాజ్  సోదరుడు జాఫర్ సర్పరాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: