ఏ ముహూర్తంలో మన దేశంలోకి కరోనా ప్రవేశించిందో కానీ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి దేశంలో గత నెల 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు, క్లబ్స్, బార్లు అన్నీ మూత పడ్డాయి.  దాంతో మద్యం ప్రియుల కష్టాలు మొదలయ్యాయి.  కొన్ని చోట్ల ఉన్మాదులుగా మారుతున్నారు.. పిచ్చి పట్టిన వారిలా ప్రవర్తిస్తున్నారు.. దాంతో హైదరాబాద్ లో ఎర్రగడ్డ ఆసుపత్రికి క్యూలు కట్టే పరిస్థితి నెలకొంది. 

 

ప్రతిరోజూ సాయంత్రానికి సుక్కా.. ముక్కా ఉంటే కానీ నిద్రపట్టని తాగుబోతు ఆసాములకు చుక్క మందు లేక నానా అవస్థతలు పడుతున్నారు. ఇప్పటికే మందు వాసన చూసి వారాలు గడిచాయి. లాక్ డౌన్ ఎప్పటికి ఎత్తేస్తారో? మందు ఎప్పటి నుంచి దొరుకుతుందో? అర్థం కాక తల్లడిల్లిపోతున్నారు. పోనీ  ధర చుక్కలను తాకుతోంది. హైదరాబాదులో క్వార్టర్ రూ. 140 ఉండే లిక్కర్ ను బ్లాక్ లో రూ. 750కి అమ్ముతున్నారు. బీరు రూ. 400-450 మధ్యలో లభిస్తోంది.

 

అవి కూడా దొరుకుతాయో లేదో తెలియని పరిస్తితి. దీంతో ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు... సొంతంగా మందు తయారు చేసుకుంటే పోలా? అని మందుబాబులు ఆలోచిస్తున్నారు.  గూగుల్ లో 'ఇంటి వద్ద ఆల్కహాల్ తయారు చేయడం ఎలా?' అని వెతుకుతున్నారు. మార్చ్ 22 నుంచి 28 వరకు ఆన్ లైన్ సర్చింగ్ లో ఇదే టాప్ అని అంటున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: