ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రెండవ సారి లాక్ డౌన్ విధిస్తూ  దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే దేశం మొత్తం లాక్ డౌన్  కొనసాగుతూనే ఉంది. అయితే దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న అందరూ లాక్ డౌన్  విజయవంతంగా పాటిస్తూ ఇంటికే పరిమితమవుతున్నారు. ఉద్యోగులు వ్యాపారులు నిరుపేదలు ధనికులు అని తేడా లేకుండా అందరు ఇంటికే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపడితు  చేయూత నిస్తుంది. ఈ క్రమంలోనే క్రమక్రమంగా కరోనా  వైరస్ ను దేశం నుంచి తరిమి కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 

 

 

 ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటికీ కూడా.. కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనను తుంగలో తొక్కుతు  ఇష్టారీతిన రోడ్లపైకి వచ్చి.. కరోనా వ్యాప్తికి  కారకులు అవుతుంటారు. బయట తిరగడం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది అని తెలిసినప్పటికీ కూడా.... బయటకు రావద్దు అంటూ అటు పోలీసులు ఇటు ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ  కొంత మంది ప్రజలు మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తూ ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. 

 

 

 అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో నిర్లక్ష్యంగా బయట తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమైన విషయం తెలిసిందే. అత్యవసరంగా కాకుండా అనవసరంగా ఎవరైనా రోడ్ల మీదికి వాహనాలతో వస్తే వాహనాలను సీజ్ చేస్తున్నారు అధికారులు. ఇక తాజాగా లాక్ డౌన్ ఇష్టారీతిన బయటకి వచ్చేవారిని  శిక్షించేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు సరికొత్త శిక్షను అమలు చేస్తున్నారు. లాక్ డౌన్  నిబంధనలను ఉల్లంఘించి బయటకు వస్తున్న ప్రజల వాహనాలను సీజ్ చేయకుండా ఉండాలి అంటే... మొబైల్ ఆరోగ్య సేతు  యాప్ డౌన్లోడ్ చేసి యాప్ లో అడిగిన అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా వారి లాగా బయటకు వచ్చిన మరో ముగ్గురిని  ఆపి  ఇలాగే ప్రశ్నలు అడగాలి అని పోలీసులు సూచిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: