ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా   ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న విషయం తెలిసిందే. కంటికి కనిపించని కరోనా వైరస్ ఎప్పుడు దాడిచేసి  ప్రాణాలను హరించుకు పోతుందో  అని అందరూ భయపడుతున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి వైరస్ ను తరిమి కొట్టేందుకు ప్రపంచ దేశాలు  సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయినప్పటికీ ప్రపంచ దేశాల్లో అల్లా కల్లోలం  సృష్టిస్తుంది కరోనా వైరస్. కంటికి కనిపించని వైరస్ కంటికి కనిపించిన వారిని కాటికి పంపిస్తోంది. రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బయం పెరిగిపోతోంది. కరోనా  పైరసీ భయం పెరిగిపోతున్న నేపథ్యంలో... ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాల ప్రజల్లో భయాన్ని రూపుమాపి.. ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాలి. కానీ ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానామ్ గేబ్రియేసన్  వ్యాఖ్యానించిన తీరు ప్రపంచ దేశాలకు మరింత భయాందోళనకు గురి చేసేలా ఉంది. 

 


 ఇప్పటికే కరోనా వైరస్ ద్వారా ప్రపంచం మొత్తం క్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యాల లో సైతం పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా  వైరస్ పై  ప్రపంచ దేశాలు భయపడుతున్న నేపథ్యంలో ధైర్యం చెప్పాల్సిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్  హెచ్చరికలు జారీ చేశారు. మమ్మల్ని నమ్మండి. ఇంకా క్లిష్ట పరిస్థితులు... ముందున్నాయి అంటూ   ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా  మహమ్మారి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ వ్యాఖ్యానించడం ప్రస్తుతం అందరినీ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కచ్చితంగా పేర్కొనక పోయినప్పటికీ... ఆఫ్రికా ఖండం మొత్తం భవిష్యత్తులో ప్రపంచ మహమ్మారి కరోనా  వైరస్ వ్యాప్తి చెంది దారుణ పరిస్థితి వస్తుంది  అని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో హెచ్చరించింది. 

 


 ఇదిలా ఉంటే ప్రపంచ జనాభాలో ఒక చిన్న నిష్పత్తి మాత్రమే అంటే రెండు లేదా మూడు కంటే తక్కువ శాతంలో మాత్రమే ప్రతిరోధకాలు ఉన్నట్లు కరోనా  వైరస్పై శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలో కొత్త విషయాలను బయట పడ్డాయి . అయితే ఇప్పటికే కరోనా  వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న దేశాల్లో నిబంధనలను సడలించి సాధారణ జీవితాన్ని గడిపేలా ప్రజలకు అనుమతిస్తున్న దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లాక్ డౌన్  ఎత్తి వేస్తున్న  దేశల్లో  కూడా కరోనా అంటూ వ్యాధి   రాకమానదు  అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే కొంత మంది మాత్రం కరోనా  వైరస్ కు సంబంధించిన ప్రతిరోధకాలను  అభివృద్ధి చేశారు అంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలపై అటు విశ్లేషకులు కూడా అయోమయంలో పడ్డారు.. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు అందరినీ కాపాడడానికి లేదా భయకంపితులను చేయడానికి అనే ప్రశ్న ప్రస్తుతం అందరిలో తలెత్తుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: