కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ కొద్దిసేపటి క్రితం హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ మీడియాతో మాట్లాడుతూ దేశంలో కరోనా నియంత్రణలోనే ఉందని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు మరింత కఠినతరం చేయబోతున్నట్లు ప్రకటించారు. కోవిడ్ వారియర్స్ కొరకు డేటా బేస్ ను రూపొందించామని తెలిపారు. ఇప్పటివరకు 1,24,000 మంది కోవిడ్ వారియర్స్ సభ్యులుగా ఉన్నారని అన్నారు. 
 
 
కరోనాపై పోరాటంలో వాలంటీర్లుగా స్వచ్చందంగా రావాలని సూచించారు. దేశంలో వాలంటీర్ల కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ గత మూడు వారాల్లో 63 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు మమోదు కాలేదని అన్నారు. వచ్చే రెండు రోజులు ర్యాపిడ్ కిట్లు వాడవద్దని సూచించారు. కేంద్రం ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వాడకంపై మార్గదర్శకాలు ఇస్తుందని చెప్పారు. 
 
ఐసీఎంఆర్ నకిలీ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల గురించి దర్యాప్తు చేయిస్తామని పేర్కొంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,49,810 మందికి పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. 
 
కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించినా కేసుల సంఖ్య్ రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఏపీలో ఈరోజు 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కర్నూలు, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూ ప్రభుత్వం రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో మరింత కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: