ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తున్న విషయం తెలుసిందే . చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ మొత్తం ప్రపంచ దేశాలను  సైతం ప్రాణభయంతో వణికిస్తోంది. ముఖ్యంగా ఎంతో అభివృద్ధి చెందిన అగ్ర రాజ్యాల ను కూడా గడగడలాడిస్తున్నది  ఈ మహమ్మారి వైరస్. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి  నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి  ఈ మహమ్మారి వైరస్ కు సరైన విరుగుడు కూడా లేకపోవడంతో ప్రపంచ దేశాల  ప్రజల ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇక కొన్ని దేశాలలో అయితే పరిస్థితి రోజురోజుకూ చేయి దాటి పోతుంది. కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య లక్షల్లో పెరిగిపోతూ ఉంది. ఇక ఈ మహమ్మారి బారిన పడి మృత్యువుతో పోరాడి మరణించిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 

 

 అయితే ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న  కరోనా వైరస్ గురించి క్లుప్తంగా తెలుసుకునేందుకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహా మహా శాస్త్రవేత్తలు సైతం ఈ మహమ్మారి కి విరుగుడు కనుగొన తో పాటు వారి యొక్క మూలాలను కూడా కనుగొనేందుకు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ఇలా చాలా పరిశోధనల్లో కరోనా వైరస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ ప్రపంచ మహమ్మారిలో  రోజురోజుకు జన్యు మార్పులు చేసుకుంటూ ఉంటుంది అని చాలా పరిశోధనల్లో వెల్లడైంది. ఇక తాజా అధ్యయనంలో మరో సంచలన నిజం కూడా బయటపడింది. 

 


 ప్రపంచాన్ని మొత్తం కబళిస్తున్న కరోనా  వైరస్ క్రమంగా  వివిధజన్యు  మార్పులకు గురి అయినట్లు తాజాగా చైనా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడించారు. సార్స్-కొట్ -2... ఇప్పటికే 30 కంటే ఎక్కువ జాతులుగా పరివర్తనం చెందింది అంటూ తెలిపిన చైనా పరిశోధకులు... ప్రపంచంలోని వివిధ దేశాల్లో వేరువేరు రూపాల్లో  ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతుంది అంటూ తెలిపారు. అయితే ఈ పరిణామంతో వైరస్ మరింత ప్రమాదకారి అవుతుంది అంటూ తెలిపిన పరిశోధకులు... ఈ మహమ్మారి వైరస్ను పూర్తిగా నివారించే క్రమంలో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు. మొత్తం 1264 మంది బాధితుల్లో  11 మంది బాధితుల నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించిన తర్వాత ఈ విషయాలను వెల్లడించారు పరిశోధకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: