లాక్ డౌన్  కారణంగా దేశ ప్రజలందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది మానసిక స్థితి పూర్తిగా మారిపోయి చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే గృహ హింస పెరిగింది అనే ఒక బలమైన వాదన కూడా వినిపిస్తోంది. 24 గంటలు ప్రతిరోజు భర్తలు ఇంట్లోనే ఉంటుంన్నందువల్ల వారి మధ్య గొడవలు తలెత్తి అది గృహ హింసకు దారి తీస్తున్నాయి అని బలమైన వాదన ఒకటి వినిపిస్తోంది. తాజాగా ఇది అక్షర సత్యం అంటూ నిరూపించే  సంఘటన ఒకటి గుజరాత్ లో జరిగింది. ప్రస్తుతం లాక్ డౌన్  కారణంగా మనుషులు ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తారు అనేది ఈ ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు. 

 

 

 గుజరాత్ లోని  వడోదరలో ఒక వ్యక్తి తన భార్య పై దాడికి దిగి విచక్షణారహితంగా దాడి చేసి వెన్ను విరగ్గొట్టాడు. మరి వీరిద్దరి మధ్య అంత పెద్ద ఘర్షణ కావడానికి కారణం పెద్దదే అయ్యుంటుంది అని అనుకుంటున్నారా అలా అనుకుంటే మాత్రం పొరబాటే. సదరు భర్త భార్య వెనుదిరిగి పెట్టడానికి గల కారణం భార్య భర్తతో ఆన్లైన్ లో ఆడిన లూడో గేమ్ లో గెలవడం. ఆన్లైన్ గేమ్ కాస్తా ఆ మహిళ వెన్ను  పెరిగేలా చేసింది. భర్తను కోపోద్రిక్తుడిని  చేసింది. వడోదర లోని వేమలి గ్రామంలో  నివసించే 24 ఏళ్ల యువతి ట్యూషన్లు చెబుతూ ఉండేది. ఆమె భర్త ఎలక్ట్రానిక్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు. లాక్ డౌన్  సమయంలో ఇంటిలో ఉండకుండా ఇరుగుపొరుగు వారితో భర్త ఊరికే కళ్ళు తిరగడం చూసిన భార్య భర్త ను  ఇంటిపట్టున ఉండేలా చేయాలని భావించింది. 

 

 

 ఈ క్రమంలోనే ఆన్లైన్లో లూడో గేమ్ ఆడదాం అంటూ భర్తతో చెప్పింది. ఇక ఈ గేమ్ ఆడుతున్న సమయంలో వరుసగా నాలుగు రోజుల పాటు భార్య పై చేయి సాధించింది. భర్తను చిత్తుగా ఓడించింది. ఇక లూడో గేమ్ లో ఓడిపోవడానికి ఎంతగానో అవమానంగా భావించిన సదరు భర్త కిరాతకంగా దాడి చేశాడు. తన భార్యను కిందపడేసి అమానుషంగా చితకబాదాడు. దీంతో సదరు మహిళ  వెన్నుముకకు తీవ్రగాయాలు కాగా.. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స అనంతరం సదరు భార్య భర్త వద్దకు వెళ్లేందుకు నిరాకరించారు. తన భర్త వద్దకు వెళ్లాలని తన తల్లిదండ్రుల వద్దే ఉంటాను అంటూ స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే కొంతమంది భార్యాభర్తల మధ్య రాజీ కుదరడంతో భర్త ఆమెకు క్షమాపణలు చెప్పగా ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: