మీడియా పట్ల చాలామంది సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉంటారు. మీడియా ప్రతినిధులపై చాలా చోట్ల దాడులు జరిగాయి ఎవరు స్పందించరా అని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం చాలా మటుకు మీడియా లో ఉండే  ఒక భావజాలపు ప్రతినిధులు మాత్రమే సపోర్ట్ ఉంటుంది. ప్రస్తుతం రాజకీయ పార్టీలు తమ చెప్పుచేతల్లో కొన్ని మీడియా సంస్థలు ఉంచుకోవాలని కొందరు భావిస్తుంటారు ఈ రోజుల్లో . వీడియో సంస్థలు కూడా చేసేదేమి లేక వారి చేతి కింద ఉంటాయి. ఎందుకంటే అలా చేయకపోతే ఆర్థికంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి హెల్ప్ ఉండదు. ప్రజల నుంచి ఏమైనా ఆదాయం వస్తుంద అంటే అదీ ఉండదు. 

 

 అయితే చాలా మటుకు నేటి రోజుల్లో జర్నలిజానికి అర్థం మారిపోయింది అని చెప్పాలి. కానీ కొంతమంది మాత్రం నికార్సైన అసలు సిసలైన జర్నలిస్టులు  మాత్రం ఇంకా ఉన్నారు  అనడానికి కొన్ని ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ నిజమైన జర్నలిస్టు గా ముందుకు వెళ్తా జర్నలిజం చేస్తా అంటే మాత్రం ఏదో ఒక విధంగా వేధించడం మొదలు పెడుతూ వుంటారు చాలామంది. మమ్మల్ని ఏమననంతవరకు నువ్వు చాలా గొప్ప జర్నలిస్టు మమ్మల్ని నిలదీస్తే మాత్రం నువ్వు అమ్ముడుపోయావు  అంటూ విమర్శలు చేయడం మొదలుపెడతారు. మీ జీవితాన్నే నాశనం చేస్తాం అంటూ ఎలాగోలా బదనాం చేస్తూ ఉంటారు. అలాంటి రోజులే ప్రస్తుతం నడుస్తున్నాయి . 

 

 అయితే తాజాగా ఆర్నబ్ గోస్వామి అనే  ఒక జర్నలిస్ట్ పిడివాద పు  జర్నలిజానికి కాస్త విముక్తి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి పెద్ద ఎఫెక్ట్ ఇవ్వడమే ప్రస్తుతం మహారాష్ట్రలో జరిగిన సంఘటన. అయితే వీడియో స్వేచ్ఛ గురించి ఎవరైతే ప్రస్తుతం మాట్లాడుతున్నారు వారు ఈ ఘటనపై నోరు మెదపలేదు. జర్నలిస్టుని 12 గంటల పాటు నిర్బంధించి మానసికంగా వేధించారు . ఇంతకీ ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఎందుకు ఆ హత్య గురించి మాట్లాడరు అన్న ప్రశ్న. ఈ ప్రశ్న అడగడమే  పాపం గా మారింది అడిగినందుకు శాపంగా మారింది..  ఆ తర్వాత జనాల్లో కోపం పెరిగింది.  ఏకంగా ఆ జర్నలిస్టుల 12 గంటలపాటు నిర్బంధించారు. అయితే ఆ జర్నలిస్టు వేసిన ప్రశ్నలకు జవాబు ఉందా లేదా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: