గత కొన్నేళ్ల  నుంచి రంజాన్ మాసంలో కొంతమంది ముస్లిం సోదరులకు రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో కొన్ని కొన్నిసార్లు ఇతర మతాల వాళ్ళు పలు ఆరోపణలు  కూడా  చేశారు. కేవలం మైనార్టీలకు సంబంధించిన పండుగకు మాత్రమే  రాష్ట్రపతి ఆధ్వర్యంలో విందు ఇవ్వడం ఎందుకని హిందువులకు సంబంధించిన దసరా దీపావళి పండుగప్పుడు కూడా ఇలాగే కొంత మంది హిందువులను పిలిచి రాష్ట్రపతి  ఆధ్వర్యంలో విందు ఇస్తే బాగుంటుందని... ఇక క్రిష్టియన్లకు కూడా క్రిస్మస్ పండుగ  సమయంలో రాష్ట్రపతి విందు  ఇస్తే బాగుంటుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

 అయితే తాజాగా ఈ కీలక సున్నితమైన అంశానికి సంబంధించి దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు  . తాజాగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎంతోమందిని షాక్ కి గురిచేసింది. ప్రజలు కష్టపడి ఇచ్చినటువంటి సొమ్ముతో .. రాష్ట్రపతి భవన్లో ఇఫ్తార్  విందులు ఇవ్వదలుచుకోలేదని... మనది  సెక్యులర్ దేశమని.. భారతదేశంలో అన్ని మతాలు సమానమే. కాబట్టి కొన్ని మతాలు గురించి పట్టించుకుని..  కొన్ని మతాలను  దూరం పెట్టడం లౌకికత్వంకి  విరుద్ధం. 

 

 అందుకే ఇక నుంచి రాష్ట్రపతి భవన్లో ఇఫ్తార్ విందు ఇవ్వదలుచుకోలేదు అంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇది రాష్ట్రపతి స్వయంగా ఇచ్చారా లేదా స్పెక్యులేషనా అన్న విషయం పక్కన పెడితే... రానున్న రోజుల్లో ఎప్పటిలా  ఇస్తార్ విందు ఇస్తారా లేదా అన్న దానిపై మాత్రం ఆధారపడి ఉంటుంది. వాస్తవంగా అయితే సంప్రదాయంగా ఎన్నో రోజుల నుంచి ఇఫ్తార్ విందు ఇస్తూ వస్తున్నారు. అయితే గత ప్రభుత్వాలు మైనార్టీల బుజ్జగింపు కోసం ఇఫ్తార్ విందును ఇచ్చాయని ఇప్పుడు.. దేశంలో బిజెపి అధికారంలో ఉన్నందున  అన్ని మతాలను సమానంగా చూస్తూ ఇఫ్తార్  విందు ఇవ్వడం లేదు  అని  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: