ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదట కేవలం ఇరవై ఒక్క రోజు మాత్రం లాక్ డౌన్  విధించిన కేంద్ర ప్రభుత్వం ఈ లాక్ డౌన్  పొడిగిస్తూ వస్తున్నారు . అయితే మరో వైపు ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు. కరోనా  కట్టడి చేయటంలో ప్రభుత్వం విఫలం అయ్యింది అని చెబుతున్నారు. . అయితే ఎంతో అధునాతన సదుపాయం వైద్య సిబ్బంది ఉన్న అగ్రరాజ్యం అమెరికాతో పోలిస్తే  మన భారతదేశ జనాభా చాలా ఎక్కువ  అయినప్పటికీ అమెరికలో  లక్ష కరోనా  నమోదైతే భారతదేశంలో కేవలం ఇప్పుడు వరకు 35 వేళ కేసులకే  ఆగిపోయింది. 

 


 ఇలా 30 వేల కేసులు మాత్రమే నమోదు కావడానికి ప్రభుత్వం అమలు చేసిన  ప్రణాళికలు కారణం అని చెప్పవచ్చు. అయితే కరోనా  తగ్గేంతవరకు లాక్  డౌన్ అమలు చేయాలంటే చాలా సమయం పడుతుంది. దీంతో  ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండేలా క్రమక్రమంగా కొన్ని సడలింపులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలోని ప్రాంతాలు లాక్ డౌన్ సడలింపులలో  భాగంగా గ్రీన్ రెడ్ ఆరెంజ్ జోన్ లుగా  అంటే మూడు భాగాలుగా విభజించారు. 

 

 దీని ప్రకారం 82 శాతం ప్రాంతాలు రిలాక్స్ కానున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రీన్ జోన్ లు  లు 60 శాతం ఉండగా.. 22% ఆరెంజ్ జోన్ లు ఉన్నాయి . మిగతా 18 శాతం రెడ్ జోన్  ఉండడం వల్ల పూర్తిగా నిబంధనలు అమలు కానున్నాయి. ఎక్కువగా గ్రామాల్లో కాకుండా పట్టణ నగరాల్లో మాత్రమే వైరస్  ఎక్కువగా ఉండటం కారణంగా..రెడ్ జోన్  పూర్తిగా నిబంధనలు అమలు చేయనున్నారు. అంటే లాల్ డౌన్  సడలింపు లో భాగంగా ఇంకా ఇబ్బందులు పడే వాళ్లు 18 శాతం వుంటారు. ఇప్పుడు 82 శాతం మందికి రిలాక్సేషన్ రాబోతుంది. మరిన్ని వివరాల కోసం కింది వీడియో క్లిక్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: