విశాఖ నగర సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురం లో ఎల్జి పాలిమర్స్ కంపెనీ నుంచి భారీ మొత్తంలో విషవాయువులు లీక్ అయ్యి  చుట్టుపక్కల గ్రామాల ప్రజల ప్రాణాల మీదికి రావడం ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వందలాది మంది ప్రజల ప్రాణాల మీదికి తెచ్చింది ఈ విష వాయువు. ఈరోజు తెల్లవారుజామున ప్లాస్టిక్ తయారీ కంపెనీ అయిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి ప్రమాదవశాత్తు భారీ మొత్తంలో విషవాయువు  వెలువడడం... చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల వరకు ఈ విషయ వాయువు  వ్యాపించి గాలిలో కలిసి పోవడం తో... దాదాపు వందలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని అనారోగ్యం పాలవుతున్నారు. 

 

 

 ఈ విష వాయువులు పీల్చుకున్న వెంటనే... శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది చర్మంపై దద్దుర్లు, కళ్ల మంటలు లాంటివి రావడంతో పాటు పిల్లలు మహిళలు ఎక్కువగా నురగలు కక్కుతూ అచేతన స్థితిలో కి వెళ్లి పోతున్నారు. ఇక చిన్నారులు అందరూ స్పృహ కోల్పోతు  అచేతన స్థితిలో కి వెళ్ళిపోతుండడంతో వారి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దీంతో అల్జీ  పాలిమర్స్ చుట్టుపక్కల గ్రామాల్లో  మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. స్పృహ కోల్పోతున్న వారందరిని ఆస్పత్రికి తరలించేందుకు దాదాపుగా 25 అంబులెన్సులు పోలీసులు వాహనాల ద్వారా చర్యలు చేపడుతున్నారు అధికారులు. 

 

 

 పరిస్థితి ఇంతకింతకు  మరింత తీవ్రతరంగా మారుతుండటం తో.. ఏకంగా ఉన్నత స్థాయి అధికారులు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే మంత్రి అవంతి శ్రీనివాస్, ఎస్పీ మీనా, కలెక్టర్, స్థానిక టిడిపి ఎమ్మెల్యే గణబాబు అందరూ అక్కడికి చేరుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. అంతే కాకుండా అక్కడ తీవ్ర భయాందోళన లో ఉన్న ప్రజలకు కాస్త ధైర్యం చెబుతున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా మరిన్ని ముమ్ముర చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: