విశాఖలో జరిగిన సంఘటన ఎంత ప్రాణ నష్టాన్ని కలిగించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశాఖలో విష వాయువు లీకేజీ కారణంగా ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడమే  కాదు ఎన్నో మూగ జీవాలు కూడా మృత్యువాత పడ్డాయి. ఇక ఈ విష వాయువు లీకేజీ ఘటన దృశ్యాలు అయితే దేశ ప్రజానీకాన్ని మొత్తం హృదయం ద్రవింప చేసాయి అని చెప్పవచ్చు. విశాఖ నగరంలోని ఆర్ఆర్ వెంకటాపురం సమీపంలో గల ప్లాస్టిక్  తయారీ కంపెనీ నుంచి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రమాదవశాత్తు భారీగా  విషవాయువు విడుదల కావడం... ఏకంగా చుట్టుపక్కల గ్రామాలకు ఇది శర వేగంగా వ్యాప్తి చెందడం క్షణాల్లో గ్రామస్తులందరూ ఈ విష వాయువు పీల్చుకుని  అపస్మారక స్థితికి చేరుకుని ఎక్కడికక్కడ కుప్పకూలడం ఇదంతా నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. 

 

 

 కాగా ఈ విష వాయువు ఘటనలో ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోయారు . అయితే ఈ ఘటనలో ని బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ దుర్ఘటన లోని  మృతుల కుటుంబాలకు పరిహారం అందజేశారు ఏపీ మంత్రులు. బాధితులను పరామర్శించిన మంత్రులు సాయంత్రం నాలుగు గంటల లోపు తమతమ గ్రామాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఇస్తామని... ప్రజల్లో నమ్మకం కలిగించడానికి ఆయా గ్రామాల్లో తాము కూడా రాత్రి సమయంలో బస చేస్తాము  అంటూ చెప్పుకొచ్చారు.తాజాగా ఈ రోజు ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్బొత్స సత్యనారాయణ లు పాల్గొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. 

 

 

 అయితే గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మృతిచెందిన వారిలో 8 మంది కుటుంబ సభ్యులకు ఈ రోజు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. ఇక వారసత్వ ద్రువీకరణ సర్టిఫికెట్లు సిద్ధం కానందున మిగిలిన నలుగురికి కూడా తర్వాత ఈ పరిహారం అందజేస్తామని తెలిపారు. అయితే ప్రస్తుతం గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది అంటూ తెలిపిన మంత్రి కన్నబాబు... ఈరోజు సాయంత్రం వరకు ప్రజలు తమతమ గ్రామాలకు వెళ్ళడానికి అనుమతి ఇస్తాము  అంటూ తెలిపారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదని... తాము కూడా ఒక రాత్రి అక్కడే బస చేసి ప్రజల్లో దైర్యం పెంచుతామన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: