టాలీవుడ్ లో ఎంత మంది దర్శకులు ఉన్నప్పటికీ శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.. శేఖర్ కమ్ముల సినిమాలలో  ఏదో మ్యాజిక్ ఉంటుంది తనదైన ప్రత్యేక శైలిలో సినిమాలు తీస్తూ మంచి విజయాలు అందుకుంటూ ఉంటారు శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ముల సినిమాలు తీయడం లోనే కాదు సాయం చేయడంలో కూడా ఎంతో ముందుగా ఉంటారు. ప్రతి విషయంలో స్పందిస్తూ ఒక సామాజిక పౌరుడిగా తన బాధ్యత ఎప్పుడు నెరవేరుస్తూ నే ఉంటారు శేఖర్ కమ్ముల. సెలబ్రిటీ అయినప్పటికీ సామాన్యుల సమస్యల పై గళం విప్పితే ఉంటారు. 

 

 తాజాగా కరోనా లాంటి కష్ట కాలంలో ఏకంగా తన మంచి మనసు చాటుకున్నారు మానవత్వం ఉన్న మనిషి గా మరోసారి నిరూపించుకున్నారు శేఖర్ కమ్ముల. వేసవికాలంలో మండుటెండల్లో కనీసం తమ ఆరోగ్యం గురించి ఆలోచించకుండా పారిశుద్ధ్య కార్మికులు ప్రజల కోసం పరిసరాల పరిశుభ్రత కోసం పాటుపడుతున్నారు. కాగా  వీరికోసం మజ్జిగ బాదం మిల్క్ లాంటివి అందించాలని నిర్ణయించుకున్నారు శేఖర్ కమ్ముల. జిహెచ్ఎంసి అధికారులు సాయంతో హైదరాబాద్ జంట నగరాల్లో పారిశుద్ధ్య కార్మికులకు చల్లటి పానీయాలు అందించారు. మండుటెండల్లో మన కోసం వాళ్లు కష్టపడుతున్న తీరును చూసి ఎంతో బాధ అనిపించింది. వారికి ఎంతైనా కొంత సహాయం చేయాలని భావించి ఈ పనికి శ్రీకారం చుట్టినట్లు శేఖర్ కమ్ముల తెలిపారు. 

 


 అయితే తాజాగా శేఖర్ కమ్ముల కి జిహెచ్ఎంసి కార్మికులు అందరూ ఎప్పుడు గుర్తుండిపోయేలా కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ ఆసుపత్రి వద్ద పారిశుద్ధ్య కార్మికులు అందరూ ఒక దగ్గర నిల్చొని థాంక్యూ శేఖర్ కమ్ముల అనేక ఫ్లకార్డులు పట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై స్పందించిన శేఖర్ కమ్ముల.. ఇది తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని... గాంధీ ఆస్పత్రిలోనే జీహెచ్ఎంసీ కార్మికులు అమూల్యమైన బహుమతి అని తనకు ఇచ్చారు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది నా అతిపెద్ద అవార్డు అంటూ తెలిపిన శేఖర్ కమ్ముల... మీరు మా కోసం చేసే పనులు తో పోలిస్తే నేను చేసింది ఏమీ కాదు అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: