ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇప్పటివరకు 213 దేశాలు కరోనా భారీన పడ్డాయి. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 75,000 దాటింది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా మహమ్మారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 
 
ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మాస్కులు ధరించకపోవడం, లాక్ డౌన్ నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కంటైన్మెంట్ జోన్లలో, రెడ్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టినా గత మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 
 
దీంతో తెలంగాణ సర్కార్ మాస్కులు ధరించని వారిపై, లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించినట్టు తెలుస్తోంది. పోలీసులు నిన్నటివరకు ఎవరైనా మాస్క్ ధరించకుండా రోడ్లపైకి వస్తే 1000 రూపాయలు ఫైన్ విధించేవారు. అయితే తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై, మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. 
 
లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని ఎన్నిసార్లు చెబుతున్నా ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్ గ‌స్తీ సిబ్బంది ద్వారా మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని గుర్తిస్తున్నారు. డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌, సెక్ష‌న్ 51 (బి) మాస్కులు ధరించని 4,719 మందిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు రాష్ట్రంలో నిన్న 41 కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనా భారీన పడి ఇద్దరు మృతి చెందడంతో కరోనా మృతుల సంఖ్య 34కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: