ప్రస్తుతం  ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది.  ప్రపంచ దేశాలన్నింటిని ఈ మహమ్మారి  చిగురుటాకుల వనికిస్తున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ ప్రభావితం దృశ్య తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేదానిపై ఒక్కొక్కరు ఒక అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా  జెనెస్ డిఫెన్స్  ఇంటలిజెన్స్  గ్రూప్ ఒక తాజా అంచనాకు వచ్చింది. చైనా ప్రపంచ యుద్ధానికి సిద్ధం అవుతుంది అంటూ వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనా  వైరస్ ను కంట్రోల్ చేసే దశలోనే ఉన్నాయి. ఆయా దేశాల్లో ఇప్పటికే మూడో  దశ కొనసాగుతుంది. కానీ చైనాలో  మాత్రం మొదటి దశలో వచ్చింది మొదటి దశలోనే తగ్గిపోయింది. 

 


 దీంతో ప్రపంచ మహమ్మారి జయించిన చైనా ప్రపంచ దేశాలను మాత్రం ఈ మహమ్మారి ట్రాప్  లోకి తోసేస్తుందని... దీంతో ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం ఎక్కువగా ఈ వైరస్ బారి నుంచి తమ దేశ ప్రజలను  ఎలా కాపాడుకోవాలి ఆర్థిక వ్యవస్థను ఎలా వృద్ధి చేయాలనే దానిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇలా చైనా నిదానంగా... సౌత్ చైనాలో  అక్రమంగా నిర్మించినటువంటి ఫెయిరీ క్రాస్ అనే  దీవిలో యుద్ధ విమానాలను ఇప్పటికే మోహరించిందని... యుద్ధ విమానాలను సరిహద్దులకు చేర్చుతుంది అని... ప్రపంచ యుద్ధానికి సిద్ధం అవుతుంది అని అంచనా వేస్తున్నారు.

 


 ఒకరకంగా చూసుకుంటే చైనా కమ్యూనిస్టు పార్టీ పుట్టి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2021 నాటికి కొత్త చైనా  ఆవిష్కరణ కోసం ప్రయత్నాలు చేస్తోంది. దీంతో బహిరంగంగా సవాల్ చేయడానికి కూడా వెనకాడబోదు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక వివాదాన్ని అడ్డుపెట్టుకొని ప్రపంచ యుద్ధానికి చైనా సిద్దపడుతోందని... ఈ సమయంలో చైనా దేశం తరఫున ఏ దేశాలు రెండు గ్రూపులుగా మారనున్నాయని... ఇదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదు అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: