లాక్ డౌన్ కఠిన తరం గా మారినా కూడా ప్రజలు బయట తిరుగు తున్నారు... అదేంటంటే కరోనా ప్రభావం తో అందరూ ఇళ్ల లోనే ఉంటున్నారు.. అయితే కొన్ని ప్రాంతా ల్లో అందరూ ఇళ్లను ఖాళీ చేసి సొంత ఊర్ల కు వెళ్తున్నారు.. ఇదే అదును గా భావించిన దొంగలు ముఠాలు ఎవరు లేని ఇళ్ల లో జోరుగా దొంగత నాలు చేస్తున్నారు.. అయితే చాలా మంది వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు.  ఇకపోతే శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో కూడా దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయట.. 

 

 

 

అది కూడా అక్కడ ఆడ వాళ్లే ఎక్కువగా చేస్తున్నారట.. వివరా ల్లోకి వెళితే.. నిత్యం లక్షల మందితో కిట కిటలాడే తిరుమల లాక్‌డౌన్ కారణం గా బోసి పోయిన సంగతి తెలిసిందే. తిరుమల వీధులన్నీ నిర్మానుష్యం గా మారడం తో అడవి జంతువులు స్వేచ్ఛగా విహరిస్తున్న వీడియోలు సోషల్ మీడియా లో హల్‌చల్ చేస్తున్నాయి. మరోవైపు తిరుమలలోని దుకాణాల్లో చోరీలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా జరిగింది. తాజా ఘటనతో అది నిజమేనని తేలింది. ఓ లేడీ కిలాడీ తిరుమలలోని దుకాణాల్లో దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు అడ్డంగా పట్టుబడడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

 

 

 

 

తిరుమలలో మహిళా దొంగ రెచ్చిపోయింది. తిరువీధుల్లో మూసివేసి ఉన్న దుకాణాలే టార్గెట్‌గా హల్‌చల్ చేసింది. అందినకాడికి దోచుకుంటూ సీసీ కెమెరాలకు చిక్కింది. తిరుమల కొండపై పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఓ మహిళ దుకాణాలలో చోరీలకు పాల్పడుతోంది. మూసి ఉన్న దుకాణాల్లోకి వెళ్లి సీసీ కెమెరాలను పగలగొట్టి వస్తువులు పట్టుకెళ్తున్న లేడీ కిలాడీ గుట్టురట్టైంది. ఆ బాగోతమంతా సీసీ కెమెరాల్లో రికార్డవడంతో ఆమె దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తానికి నిఘా పెట్టిన పోలీసులు ఆమె పని పట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: