ఒకప్పుడు ఎంతగానో లక్సరీ లైఫ్ ని అనుభవించిన విజయ్ మాల్యా.. జల్సాలకు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టిన విజయమాల్య ప్రస్తుతం ఈడీ  అధికారుల నుంచి తప్పించుకు తిరుగుతున్న విషయం తెలిసిందే. కింగ్ ఫిషర్  సంస్థ దివాలా తీయటం.. బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పులు తీసుకుని వాటిని ఇతర అవసరాల కోసం ఉపయోగించడం... అంతేకాకుండా బకాయి ఏమి కట్టకుండా విదేశాలకు పారిపోవడం తో.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ మాల్యా కేసును ఈడీ దర్యాప్తు చేస్తుంది. అయితే విజయ్ మాల్యా న్యాయం కావాలని కోరుతూ లండన్  సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా... విజయ్ మాల్యా నేరాలకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించడంతో విజయ్ మాల్యా పిటీషన్ను కోర్టు కొట్టివేసింది. 

 

 ఇక ఇప్పుడు విజయ మాల్యాను అప్పగించడం  ఒకటి తరువాయిగా  మారిపోయింది. అయితే విజయ్  మాల్యా గురించి ప్రస్తుతం విశ్లేషకులు మాత్రం విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం బ్యాంకులకు అప్పు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోవడం అవసరం లేదని.. ఎందుకంటే అల  అప్పు ఎగ్గొట్టిన వారికి ఉరిశిక్ష లాంటివి ఏమీ పడవని. అయితే విజయ్ మాల్యా  విదేశాలకు పారిపోవడానికి కారణం.. విజయ్ మాల్యాను ఈడీ అధికారులు విచారిస్తే ఎంతో మంది ప్రముఖులు బయటకు వస్తాయని  వాదన బలంగా వినిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు. 

 

 విజయ్ మాల్యా తన కింగ్ ఫిషర్  సంస్థ కు నష్టాలు రాక ముందు నుంచి... మనీలాండరింగ్ కొనసాగించాడు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న వాదన. తన ఎయిర్లైన్స్ ద్వారా ఎంత గానో  మనీ చేతులు మారింది కొత్త వాదన వినిపిస్తోంది. ఇక విజయ్ మాల్యా మనీలాండరింగ్ ద్వారా ఏకంగా  ఉగ్రవాదులకు సైతం సహాయం చేశాడట. ముంబైలో జరిగిన ఉగ్రదాడి వెనుక విజయ్ మాల్యా మని లాండరింగ్  కూడా ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ప్రస్తుతం ఈడీ  విజయ మాల్యాను ఇండియాకు తీసుకొచ్చి విచారణ చేస్తే ఎంతో మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు . అంతే కాకుండా ఎంతో మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా.. పీఎఫ్ కట్ చేసి వాటిని జమ  చేయకుండా.. ఉన్నారు విజయ్ మాల్యా. ఇవన్నీ రికవరీ చేయడం కూడా సాధ్యం అవుతుంది అని అంటున్నారు విశ్లేషకులు

మరింత సమాచారం తెలుసుకోండి: