గత రెండు వారాల నుంచి దేశవ్యాప్తంగా వలస కార్మికుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో వలస కార్మికులు కాలినడకన సొంతూళ్లకు చేరుకుంటున్నారు. మోదీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో వలస కార్మికులను సొంతూళ్లకు తరలించారు. వలస కార్మికుల కోసం శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేశారు. వలస కార్మికులకు ఆశ్రయం, భోజనం కల్పించడం కోసం రాష్ట్రాలకు వేల కోట్ల నిధులు అందజేశారు. 
 
బీజేపీ నేతలు వలస కార్మికులకు ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 1.7 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ, వలస కార్మికుల సహాయ అవసరాలు తీర్చటానికి 2020 మే జూన్ నెలలలో ఉచితంగా కార్మికులకు 5 కిలోల చొప్పున బియ్యం, కిలో శనగలు పంపిణీ చేయాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనపు ఆహార ధాన్యాలను పంపిణీ చేశామని అన్నారు. 
 
2020 మే, జూన్ నెలలలో 20 కోట్ల మంది రేషన్ కార్డులు లేనివారికి ఆహార ధాన్యాలకు 3900 కోట్లు, దేశంలోని 83 శాతం మంది ఏ రాష్ట్రంలోనైనా వన్ నేషన్ వన్ రేషన్ ద్వారా బియ్యం వేయించుకోవచ్చని.. ఉపాధి కల్పించటానికి పని దినాలను పెంచామని, వేతన రేటును పెంచామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే వలస కార్మికుల విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్న కేంద్రం మధ్య తరగతి వర్గాల విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహించింది. 
 
ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసుకునే వారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి మోదీ ఏం చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. నిజమైన అవసరార్థులైన మధ్య తరగతి వారి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయి. కేంద్రం అందరికీ ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాల వల్ల మధ్య తరగతి వారికి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని చెప్పాలి. వలస కార్మికుల కోసం ఎంతో చేసిన మోదీ మధ్య తరగతి వర్గాలను మరిచారనే చెప్పాలి. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: