ప్రస్తుతం మహమ్మారి కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచ దేశాలు ఎన్నో పరిశోధనలు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్ని పరిశోధనలు జరుగుతున్నప్పటికీ ఎక్కడ సత్ఫలితాలు మాత్రం రావడం లేదు. ఈ క్రమంలోనే కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటైన భారత కూడా ఈ మహమ్మారి వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రయోగాలు ఎన్నో జరుగుతున్నాయి. అయితే భారత్లో కరోనా  వైరస్ ప్రయోగాలకు సంబంధించి తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఒక శుభవార్త చెప్పారు. ప్రస్తుతం భారత దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్  తయారీలో భాగంగా 14 రకాల పరిశోధనలు జరుగుతున్నాయనీ.. వీటిలో నాలుగు టీకాలు అతి త్వరలో క్లియరెన్స్ ట్రయల్ దశకు కూడా చేరుకోనున్నాయి అంటూ ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. 

 


 తాజాగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తో సోషల్ మీడియా ద్వారా ఇంటరాక్షన్ అయ్యారు ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్.ఈ సందర్బంగా  కరోనా వైరస్ కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. ఐదు నెలల్లో భారత్లో నాలుగు కరోనా వ్యాక్సిన్లు కీలక దశకు చేరుకోనున్నాయి అంటూ భారత ప్రజానీకానికి శుభవార్త చెప్పుకొచ్చారు ఆయన. ప్రపంచ దేశాలలో కూడా ఈ మహమ్మారి వైరస్ కు అభివృద్ధి చేసే ప్రయత్నాలు  ఎన్నో జరుగుతున్నాయంటూ వెల్లడించారు. ఇందులోభాగంగానే ఏకంగా 100 వ్యాక్సిన్లు  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్నాయని తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్... వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ప్రయోగాల ను సమన్వయం చేస్తుంది అంటూ వెల్లడించారు. 

 

 భారత్ లో కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించిన ప్రయోగాలకు... సైన్స్ అండ్ టెక్నాలజీ బయో టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఎప్పుడు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇక ప్రస్తుతం భారతదేశంలో ప్రయోగ దశలో ఉన్న  14 పరిశోధనలు త్వరలో క్లినికల్ ట్రయల్స్ కు చేరుకుంటాయని ఆయన వెల్లడించారు. అదే సమయంలో ప్రపంచ మహమ్మారి అయినా కరోనాకు వ్యాక్సిన్  ఇప్పుడిప్పుడే వస్తుందనుకోవడం కూడా తొందరపాటే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ ప్రస్తుతం భారత్ lo జరుగుతున్న ప్రయోగాలలో కరోనా వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్ విజయవంతం అయినప్పటికీ అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మాత్రం మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: