దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. రేపటితో లాక్ డౌన్ ముగియనుండటంతో ఐదో విడత లాక్ డౌన్ అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదో విడతలో నిబంధనల సడలింపు ఏ విధంగా ఉండబోతుందని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 
 
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లాక్ డౌన్ కోసం సూచనలు స్వీకరించింది. ప్రస్తుతం కేంద్రం ఈ నిబంధనలకు తుదిరూపం ఇస్తోంది. ఐదో విడత లాక్ డౌన్ లో హోటల్స్, డైన్-ఇన్ రెస్టారెంట్లు, బీచ్‌లకు సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటకం తెరవాలని, పరిమితి సంఖ్యలో విజిటర్లకు అవకాశం ఇవ్వాలని పలు రాష్ట్రాలు కేంద్రానికి సూచించినట్టు తెలుస్తోంది. 
 
పరిమితమైన సిట్టింగ్ కెపాసిటీతో డైన్-ఇన్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. విజిటర్లకు ఆరోగ్య సేతు యాప్ ను తప్పనిసరి చేయడంతో పాటు టెంపరేచర్ చెకప్ తప్పనిసరి చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సడలింపుల ద్వారా రాష్ట్రాలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. టూరిజం, ఆతిథ్య రంగాలపై ప్రధానంగా ఆధారపడే రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ సడలింపులకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 
 
ఒక ప్రభుత్వ సీనియర్ అధికారి మాట్లాడుతూ టూరిజం, ఆతిథ్య రంగాలకు లాక్‌డౌన్ 5.0 లో ఉపశమనం కలిగే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరి, కేరళ, గోవా, కొన్ని ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు ప్రధానంగా ఆతిథ్య, పర్యాటక రంగాలపై ఆధారపడ్డాయి. 50 శాతం సామర్థ్యం, సామాజిక దూరం పాటించాలన్న నిబంధనలతో ఈ రంగాలకు ఉపశమనం లభించనుందని తెలుస్తోంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ మహాజన్ టూరిజం, ఆతిథ్య రంగాలకు ఉపశమనం కలిగించాలని... జిమ్‌లు కూడా తెరవాలని అమిత్ షాకు సూచించానని తెలిపారు. మరో 15 రోజులు లాక్ డౌన్ ను పొడిగించాలని ఆయన కేంద్రానికి చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: