నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో రహస్యంగా భేటీ అయిన బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస రావు ఇద్దరూ టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడంతో చంద్రబాబు పైనే ఇప్పుడు అంతా వేలెత్తి చూపించే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక నిమ్మగడ్డ రమేష్ మొదటి నుంచి వైసిపిని విమర్శిస్తూనే వస్తోంది. ఆయన తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లుగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ, ఆయనను ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తొలిగించి కొత్తగా కనగరాజ్ అనే రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమించిన సంగతి తెలిసిందే. 

IHG


ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. ఇదిలా ఉంటే, ఇదే విషయమై టిడిపి నాయకుడు వర్ల రామయ్య స్పందించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్ ఈ ముగ్గురు భేటీ అయితే తప్పేంటని ప్రశ్నించారు. ఈ భేటీ జరిగిన 13వ తేదీన నిమ్మగడ్డ ఈసీ గా లేరు అనే విషయాన్ని గుర్తు చేశారు. అసలు ఈ సిసి టీవీ ఫుటేజ్ ఎలా బయటికి వచ్చిందో తమకు తెలుసునని, పోలీసులు వచ్చి ఈ సిసి ఫుటేజ్ తీసుకువెళ్లారని, కానీ దాన్ని సాక్షి టీవీకి మాత్రమే ఎందుకు ఇచ్చారని వర్ల అనుమానం వ్యక్తం చేశారు. అసలు సాక్షి కంటే ముందు మరో చానల్లో ఈ భేటీకి సంబంధించిన దృశ్యాలు ప్రచారమైయ్యాయని వర్ల రామయ్య విశ్లేషించారు. 

 


ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏపీలో రాజ్యాంగ వ్యవస్థను రక్షించాలంటూ సుజనా చౌదరిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పేందుకే ఆయనతో భేటీ అయి ఉండవచ్చని వర్లరామయ్య చెప్పుకొచ్చారు. అసలు ఆ ముగ్గురు ఏమైనా అరాచక శక్తులా అంటూ ఎదురు ప్రశ్నించారు. మొత్తంగా ఈ వ్యవహారం చూస్తుంటే, నిమ్మగడ్డ విషయంలో ఎదురు దాడి చేయడం ఒక్కటే మార్గంగా టిడిపి భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాకపోతే ఈ వ్యవహారంపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తా కథనాలు రావడంతో, తెలుగుదేశం పార్టీ సందిగ్ధంలో పడిపోయినట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: