ప్రస్తుతం చైనా భారత్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దులోని ఇరు దేశాలకు సంబంధించిన సైన్యం భారీ మొత్తంలో మెహరిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరగడం ఖాయం అనే విధంగా ఉన్నాయి ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితులు. గాల్వాన్ లోయలో నో మ్యాన్  జోన్లోకి చైనా రావడంతో సరికొత్త వివాదం మొదలై.... ఏకంగా  వివిధ దేశాల సైనికుల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇలా ఘర్షణలో  ఏకంగా భారత సైన్యం 20మంది జవాన్లను కోల్పోయింది. అదే సమయంలో చైనా సైనికులు చనిపోయినప్పటికీ  బయటకు మాత్రం విషయం రాలేదు. అయితే చైనా భారత్ వివాదం తెరమీదికి తీయడానికి కారణం.. గాల్వన్ లోయ  భూభాగంలోకి కలుపుకోవడానికి కాదు అని అంటున్నారు విశ్లేషకులు. 

 

 ముఖ్యంగా కరోనా సమయంలో ప్రపంచ దేశాలు చైనా పై విమర్శలు చేస్తున్న సమయంలో వారి అందరి దృష్టిని మరల్చేందుకు.. మరోవైపు సొంత పార్టీ లో వస్తున్న వ్యతిరేకతను కూడా తగ్గించేందుకు.. ఇంకోవైపు ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా వారి దృష్టిని మరల్చేందుకు.. భారత్ ఎదురు తిరుగుతుంది అని తెలిసినప్పటికీ చైనా వివాదాన్ని లేవనెత్తింది అని అంటున్నారు విశ్లేషకులు. ఇదే సమయంలో చైనా కు ప్రస్తుతం ఉత్తర దిశగా ఉన్న పాకిస్థాన్ మాత్రం నలిగి పోక తప్పదు అంటున్నారు. భారత్-చైనా మధ్య తలెత్తిన వివాదంతో  పాకిస్తాన్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. 

 


 ప్రస్తుతం చైనా బేస్ పెట్టుకుంటుంది పాకిస్థాన్లోనే. అయితే చైనా కు సంబంధించినటువంటి దళాలు ముఖ్యమైన ఆయుధాలకు  పిఓకే ఆశ్రయం గా  మారిపోయింది. ఇక ఆ ప్రాంతం నుంచే  మొత్తం వ్యవహారం నడుపుతుంది. అయితే దీన్ని ప్రపంచ దేశాలు మొత్తం గమనిస్తున్నాయి. అయితే ఇలా భారత్ పాక్  ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న చైనా ఎయిర్ బేస్ ని నాశనం చేయాలి అనుకుంటే యుద్ధ విమానాలతో దాడి చేస్తోంది అంతేకాకుండా సైనికులు పాక్  ఆక్రమిత కాశ్మీర్ లో కి వెళ్ళినప్పుడు అక్కడ చైనా సైనికులు ఉంటే ప్రపంచ దేశాలు మొత్తం భారత్ వెంటనే యుద్ధానికి దిగే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్థాన్ సైనికులు యుద్ధం చేస్తే చైనా కోసం  పాకిస్తాన్ సైనికులు చనిపోయే  అవకాశం ఉంది. ఇలా చైనా భారత్ మధ్య తలెత్తిన వివాదం లో పాకిస్థాన్ ఎంతగానో దెబ్బ తింటుంది అని అంటున్నారు విశ్లేషకులు,

మరింత సమాచారం తెలుసుకోండి: