హైదరాబాద్ నగరంలో ఈ నెల 3వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటం.... నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కేసులు గ్రేటర్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్ లో లాక్ డౌన్ అమలవుతుందని ప్రచారం జరగడంతో ఆంధ్రా ప్రజలు నగరం నుంచి సొంత గ్రామాలకు వెళ్లిపోతున్నారు. అయితే ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారి గురించి కీలక ప్రకటన చేశారు. 
 
ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారిని అనుమతించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని కీలక ప్రకటన చేశారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, ఆంక్షలు కొనసాగుతున్నాయని... వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాలని..... పాస్ కోసం స్పందన వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచనలు చేశారు. 
 
ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తామని.... రాష్ట్రానికి వచ్చేవాళ్లకు పాస్‌ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పోలీస్‌ చెక్‌పోస్టుల దగ్గర థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని ఏపీలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. పాస్‌లు ఉన్నా రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించబోమని కీలక ప్రకటన చేశారు. 
 
అత్యవసర, నిత్యావసర సర్వీసులకు మాత్రమే రాత్రి వేళల్లో అనుమతి ఉంటుందని..... ఈ నిబంధనల గురించి తెలుసుకుని ప్రజలు సహకరించాలని సూచనలు చేశారు. ప్రజలు సైతం ఈ మార్పులను గమనించాలని అన్నారు. తెలంగాణ జిల్లాల నుంచి ఏపీకి వేలాదిమంది క్యూకట్టారు. ఏపీ సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టుల దగ్గర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయినట్టు తెలుస్తోంది. పోలీసులు సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ప్రయాణాలు చేసుకోవచ్చని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: