ఏం కరోనా వైరస్ ఏమో కానీ, దీనికి సంబంధించిన ప్రతి వార్త జనాలను భయపెట్టేదిగానే ఉంది. ఈ వైరస్ ఉగ్రరూపం ఇప్పుడు మరింతగా పెరిగిపోతూ ఉండటం, ఇప్పట్లో దీని దూకుడుకు కళ్లెం పడేలా లేకపోవడం, సరైన వ్యాక్సిన్ ఏది అందుబాటులోకి రాకపోవడం వంటి కారణాలతో ప్రపంచ దేశాలన్నీ భయంభయంగా ఆందోళనలో గడుపుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో దీని ప్రభావం రోజురోజుకు శృతిమించుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కోటి కి పైగా కరోనా పాజిటివ్ కేసులు దాటిపోయాయి. వేలాది మంది దీని కారణంగా మరణిస్తున్నారు.

 

IHG

మిగతా జనాలంతా ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా గడుపుతున్నారు. ఇక సాంకేతికపరంగా, వైద్యపరంగా ప్రపంచ దేశాలు అన్నీ ఎంతో ప్రగతిని సాధించినా ఈ వైరస్ కు సంబంధించింది మందును ఇప్పటి వరకు కనుక్కో లేకపోవడంతో  జనాల్లోనూ అసంతృప్తి పెరిగిపోతోంది. ఎప్పటికప్పుడు ఈ మహమ్మారి తన లక్షణాలు మార్చుకుంటూ వస్తుండడంతో, దీనికి సరైన వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అవకాశం దొరకడం లేదు. దీనిపై మరింత అధ్యయనం చేస్తే తప్ప, పరిస్థితి అదుపులోకి వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్, సిసిఎంబి సంస్థలు దీనికి సంబంధించి పరిశోధనలు చేసింది.

 

కోవిడ్ 19 జన్యు క్రమాలను విశ్లేషించే క్రమంలో, ఎన్నో ఆసక్తికర అంశాలను వారు బయటపెట్టారు. ఇప్పటి వరకు వెయ్యికి పైగా, వైరస్ నమూనాలను పరిశీలించిన తర్వాత తేల్చిన విషయం ఏంటంటే, మార్చి, ఏప్రిల్ లో కనిపించిన వైరస్ స్వరూపానికి, ఇప్పుడు కనిపిస్తున్న వైరస్ కు మధ్య చాలా తేడా ఉందని, ప్రపంచ వ్యాప్తంగా 11 రకాల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు గా పరిశోధకులు గుర్తించారు. మనదేశంలో రెండు రకాల వైరస్ లు ఉన్నట్లు చెబుతున్నారు.

 

మార్చి నెలలో ఏ 2 , ఏ 3, ఏ3 ఐ, బి4, ఏ1 రకాల వైరస్ లు ఉన్నట్లుగా వారు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా మే మూడో వారం నుంచి జూన్ రెండవ వారం వరకు ఏ 2 తప్పించి, మిగిలిన వాటి ఉనికి పెద్దగా లేదని, మన దేశంలో ఏ 2 వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఇదే వైరస్  60 శాతానికి మించి ఉందని వారు తమ పరిశోధనల వివరాలను వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: