ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రియుడి మోజులోపడి ఏకంగా కన్నబిడ్డలను వదిలేసేందుకు  కూడా వెనకాడడం లేదు మహిళలు. ఇప్పటికే ఎంతోమంది ప్రియుడి మోజులోపడి కన్నబిడ్డలను చంపుతున్న ఘటనలో కూడా చాలానే తెరమీదకు వచ్చాయి. ఇలాంటి ఘటనలను చూస్తుంటే సభ్య సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలల కోసం చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని కూతురిని ... ప్రియుడి మోజులో పడి నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయింది ఆ కసాయి తల్లి.



పేగు తెంచుకుని పుట్టిన బంధం కంటే.. అక్రమ సంబంధమే ఎక్కువ అనుకుంది. కన్నబిడ్డనే అనాధను చేసేసింది.. వివరాల్లోకి వెళితే... బిందు అనే ఏళ్ల అమ్మాయిని 6 నెలల క్రితం తల్లి నిహారిక వదిలి వెళ్ళిపోయింది. ప్రియుడు ప్రసాద్ తో  కలిసి రెండు రోజుల్లో వస్తాను అని ఇప్పటి వరకు తిరిగి రాలేదు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు వచ్చిన ప్రసాద్ వాచ్మెన్ గా ఓ  ఇంట్లో పనికి కుదిరాడు... అదే ఇంట్లో పనిమనిషిగా చేరింది నిహారిక. అయితే వీరి నివాసం పక్కనే పసునూరి కుమారుని అనే  మహిళతో అక్క అక్క అంటూ పరిచయం పెంచుకున్నారు .



ఈ క్రమంలోనే నిహారిక ప్రసాద్ మధ్య అక్రమ కొనసాగుతోంది. అక్రమ సంబంధానికి కూతురు అడ్డు వస్తుందని భావించిన నిహారిక అక్క అంటూ అంటూ పిలిచే కుమారిని  దగ్గర తన కూతురు ని వదిలేసి రెండు రోజుల్లో వస్తాను అంటూ వెళ్లిపోయింది. దీంతో ఏదో పని కోసం వెళుతున్నారేమో అప్పటి వరకు వాళ్ళ  కూతురుని నా దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంది సదరు మహిళ. కానీ ఆ తర్వాత ఇదంతా ప్లాన్ ప్రకారమే చేసినట్లు ఆ మహిళ అర్థం చేసుకుంది. ఆ చిన్నారికి  తల్లి ఏమైంది అని కూడా అర్థంకాని పరిస్థితి.



ప్రియుడి మోజులోపడి ఏకంగా పేగు తెంచుకొని పుట్టిన కన్న బిడ్డనే వదిలేసింది  తల్లి నిహారిక. ఇక తానే కష్టంగా బతుకుతున్న సమయంలో సదరు 7 ఏళ్ల బాలికను సాదడం కుమారినికి చాలా కష్టంగా మారి పోయింది  ఇక ఇటీవల ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్  గురించి తెలిసి పోలీసులకు సమాచారం అందించడంతో ఆపరేషన్ ముస్కాన్ టీమ్ వచ్చి... బాలికను రెస్క్యూ హోంకు తరలించారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: