ప్రతిపక్ష టీడీపీలో కమ్మ సామాజికవర్గం ఆధిపత్యం ఎలా ఉంటుందో...అలాగే అధికార వైఎస్సార్‌సీపీలో రెడ్డి సామాజికవర్గం డామినేషన్ ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.  అటు పార్టీలో గానీ, ఇటు ప్రభుత్వంలో గానీ రెడ్డి నేతల హవా ఎక్కువగానే ఉంది. ఇక గత ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున గెలిచిన రెడ్డి ఎమ్మెల్యేలు కూడా ఎక్కువే. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఏకంగా 8 మంది గెలిచారు.

 

జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉంటే, అందులో వైఎస్సార్‌సీపీ 12 సీట్లు గెలవగా, టీడీపీ రెండు చోట్ల గెలిచింది. అయితే 12 సీట్లలో 8 మంది రెడ్డి ఎమ్మెల్యేలే ఉన్నారు. అనంతపురం అర్బన్‌-అనంత వెంకట రామిరెడ్డి, పుట్టపర్తి-దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ధర్మవరం-కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తాడిపత్రి-కేతిరెడ్డి పెద్దారెడ్డి, రాప్తాడు-తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, రాయదుర్గం-కాపు రామచంద్రారెడ్డి, కదిరి-పెదబల్లి వెంకట సిద్ధా రెడ్డి, గుంతకల్-వై. వెంకట రామిరెడ్డిలు గెలిచారు.

 

అయితే ఇంతమంది రెడ్డి ఎమ్మెల్యేలు గెలిచిన కూడా ఇందులో ఒక్కరికీ కూడా మంత్రి పదవి దక్కలేదు. పెనుగొండ నుంచి గెలిచిన బీసీ నేత శంకర్ నారాయణకు జగన్ మంత్రి పదవి ఇచ్చారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా శంకర్ నారాయణ ఉన్నారు. ఇలా జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ మాట చెల్లుబాటు కావడం లేదని తెలుస్తోంది. అసలు మంత్రికంటే ఈ రెడ్డి ఎమ్మెల్యేలే పవర్ ఎక్కువగా ఉందని అర్ధమవుతుంది.

 

జిల్లాలో రెడ్డి ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువగానే ఉంది. దీంతో నారాయణ పవర్ పెద్దగా పనిచేయడం లేదు. పైగా మంత్రిగా నారాయణ పనితీరు కూడా పెద్దగా సంతృప్తికరంగా కూడా లేదని, అదేవిధంగా నారాయణ మంత్రి అని రాష్ట్రంలో చాలామందికి ప్రజలకు తెలియదని ప్రచారం జరుగుతుంది. కుదిరితే నెక్స్ట్ టర్మ్‌లో నారాయణ పదవి కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే రెడ్డి ఎమ్మెల్యేల్లో ఎవరోకరికి పదవి దక్కే ఛాన్స్ ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: