ఎన్నో కఠిన చట్టాలు... నేరం చేసిన వారికి ఉరిశిక్ష లేదా ఎన్కౌంటర్... ఇలాంటి కఠిన  శిక్షలు విధించినప్పుటి కి కామాందుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఆడది కనిపిస్తే చాలు కామంతో ఊగిపోయి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కోరిక  తీర్చుకోవడమే  లక్ష్యంగా పశువుల్లా  మీద పడి పోతున్నారు. ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ రోజురోజుకు వారి జీవితం ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కామందుల కోరల్లో చిక్కుకొని బలవుతున్నారు ఎంతోమంది ఆడపిల్లలు. అభం శుభం తెలియని చిన్నారులు నుంచి పండు ముసలి వరకు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయింది నేటి సమాజంలో. ఇక్కడ సభ్యసమాజం తలదించుకునే ఓ ఘటన జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికపై  సెల్ఫోన్ ఆశ చూపించి అనేకసార్లు లైంగిక దాడికి  పాల్పడి ఏకంగా ఆమెను గర్భవతిని చేశాడు. 

 


 అనంతపురం జిల్లాలో ఈ  దారుణ ఘటన చోటుచేసుకుంది. రాప్తాడు  ప్రాంతానికి చెందిన శంకర్ అనే యువకుడు వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నాడు. అతడికి భార్య తొమ్మిది నెలల కుమారుడు కూడా ఉన్నారు. అయితే ఇంటి పక్కనే ఉంటున్న 15 ఏళ్ల బాలిక పై కన్నేశాడు. సెల్ఫోన్ ఆశ చూపించి క్రమక్రమంగా సదరు బాలిక ను మచ్చిక చేసుకున్నాడు. ఇక బాలిక తల్లిదండ్రులు రోజు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లి వస్తూ ఉంటారు . ఈ క్రమంలోనే సెల్ ఫోన్ లో  సినిమాలు వీడియోలు చూపించి  సదరు బాలికను అసభ్యంగా తాకుతూ ఉండేవాడు. తెలిసి తెలియని వయసు కావడంతో ఆ బాలిక శంకర్ దుర్బుద్ధి అర్థం చేసుకోలేకపోయింది. 

 

ఇదే అదునుగా భావించిన శంకర్ ఆ బాలికకు గత కొన్ని రోజుల నుంచి పోర్న్ వీడియోలు చూపించడం మొదలు పెట్టాడు. అందులో ఉన్నట్టుగానే చేస్తే ఎంతో  బాగుంటుందని నమ్మించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవలే బాలిక శరీరంలో పలు మార్పును గమనించిన తల్లిదండ్రులు.. విషయం ఆరాతీయగా అసలు నిజం బయటపడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా బాలిక గర్భంతో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. అయితే గ్రామ పెద్దలు తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో  పోక్సో  చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: