ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది చైనా వ్యవహారం. ప్రతి విషయంలో కూడా చైనా వ్యవహారం ఎంతో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఏ దేశంతో వివాదం ఏర్పడిన... వ్యూహాలను అమలుచేసేందుకు... ఎన్నో సంవత్సరాల ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది చైనా. . చైనా జలాన్ని కూడా ఆయుదంగా మలుచుకొని ఏకంగా దేశాల పై దాడి చేసేందుకు సిద్ధమవుతోందన్న వాదన వినిపిస్తోంది. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చైనాలో నీటి ప్రాజెక్టులు నిర్మించి.. తమతో విరోధం పెట్టుకున్న దేశాలపై జలంతో దాడులు చేసేందుకు తగిన వ్యూహాలు ఇప్పటికే సిద్ధం చేసుకుందట. తాజా ఘటనలే ఇందుకు నిదర్శనంగా మారాయి అంటున్నారు విశ్లేషకులు.
చైనా నీటిని కూడా ఆయుధంగా మార్చుకుని ఇతర దేశాలపై దాడులకు పాల్పడుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. చైనాలో కట్టిన త్రీ గాడ్జెట్స్ భారీ ప్రాజెక్టు కట్టడానికి ముఖ్య కారణం... అక్కడ వ్యవసాయం కోసం కాదని... చైనాకు విరోధులుగా ఉన్న దేశాలపై జలయుద్దానికి భారీ ప్రాజెక్టులు కట్టారు అన్న వాదన ప్రస్తుతం తెరమీదికి వచ్చి సంచలనంగా మారింది. చైనా ఇప్పటి వరకు నిర్మించిన దాంట్లో 100 నీటి ప్రాజెక్టు లు కేవలం జల యుద్ధం కోసమే నిర్మించారు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. చైనా ప్రాజెక్టు లు... వ్యవసాయం కోసం కట్టినవి కాదని... ఈ ప్రాజెక్టుల నుంచి రైతులకు ఎలాంటి నీరు అందడం లేదని... జల యుద్ధం కోసమే ఈ ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తున్నారు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్.
ఏ దేశంతో విరోధం పెరిగితే ఆ దేశంపై నీటిని విడుదల చేసి జల యుద్ధం చేసేందుకు ముందు జాగ్రత్త ప్రాజెక్టులు నిర్మించుకుంది అని అంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా చూసుకుంటే చైనా ఏకంగా 13 దేశాలపైన... సమయం వచ్చినప్పుడు జలాన్ని ఆయుధంగా వాడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే చైనా ఆయుధం ప్లాన్ కాస్త సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. ఎక్కువగా నీరు నిల్వ ఉండడంతో ఏకంగా చైనాలోనే వరదలు వచ్చాయి . చైనా లోని 13 నగరాలు 145 పట్టణాలు 1432 గ్రామాలు పూర్తిగా వరదలతో మునిగిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. అయితే ఇది తమ అసమర్థత అని ఒప్పుకోకుండా చైనా మాత్రం ఇంజినీరింగ్ లోపం అంటూ చెప్పుకొస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి